కొత్త నోట్ల కోసం క్యూ కట్టింది.. కొపం వచ్చి టాప్ విప్పేసి మొత్తం చూపించింది | Girl goes topless after standing in ATM queue.

Angry girl goes topless after standing in atm queue

ATM queue, Delhi Girl Topless, Topless Girl ATM queue, Angry girl goes topless, Delhi Girl AT ATM, ATM topless, Topless at ATM, Demonstration Effect

Angry girl goes topless after standing in ATM queue for hours in Delhi.

కొత్త నోట్ల కోసం యువతి టాప్ లేపేసే ఐడియా

Posted: 11/14/2016 03:51 PM IST
Angry girl goes topless after standing in atm queue

బహుశా ఇప్పుడు దేశంలో ప్రజలు ఎదుర్కుంటున్న పరిస్థితి చాలా విచిత్రమైందనే అనుకోవాలి. తమ పాత నోట్లను మార్చుకునేందుకే ప్రజలు గంటల తరబడి బ్యాంకుల, అవసరమైన డబ్బు కోసం ఏటీఎంల వద్ద క్యూ కట్టే పరిస్థితి నరకాన్ని తలపిస్తోంది. ఒక్కోసారి ఐదారు గంటలు ఎదురు చూసినా తమ వంతు వచ్చేసరికి.. డబ్బు అయిపోవటమో, లేక సమయం గడిచిపోవటమో లాంటివి జరుగుతుండటంతో వారిలో అసహనం, ఆగ్రహాం కట్టలు తెంచుకోంటోంది. మరోవైపు ప్రభుత్వం చేపట్టే ప్రత్యామ్నాయ చర్యలు కంటి తుడుపుగానే పరిణమిస్తున్నాయి.

ఇదిలా ఉంటే గంటల గంటలు సమయం వృథా చేయటం ఎందుకనుకుందో ఏమో దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతి చేసిన నిర్వాకం ఇప్పుడు దేశం అంతా మారుమోగిపోతుంది. ఆ అమ్మాయి చేసిన పని చూసిన అక్కడున్న వాళ్లంతా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు. ఇంతకీ ఏం చేసిందంటారా? ఏకంగా టాప్ విప్పేసి అందరి ముందు నిలుచుంది.

ఆదివారం మధ్యాహ్నం సమయం మయూర్ విహార్ ఫేస్ -3 లోని ఓ బ్యాంక్ ఏటీఎం వద్ద జనం భారీగా గుమిగూడీ ఉన్నారు. ఆకుపచ్చ పంజాబీ డ్రెస్ ధరించిన ఓ యువతి లైన్ లో నిలుచుని ఉంది. మూడు గంటలు నిలుచున్నా ముందుకు కదలకపోవటంతో సహానం కోల్పోయిన ఆ యువతి ఒక్కసారిగా తాను వేసుకున్న డ్రెస్ టాప్ విప్పేసింది. తన వక్షోజాలను చూపిస్తూ జనం మధ్యలోకి వచ్చి నిలుచుంది.

Girl topless for New Notes

జనలంతా ఆమెనే చూస్తూ ఉండిపోగా, కొందరు మహిళలు యువతిని వారించే ప్రయత్నం చేశారు. కానీ, యువతి మాత్రం అలాగే ఉండిపోయింది. చివరకు మహిళా పోలీసులు రంగ ప్రవేశం చేసి అమ్మాయిని ముందు ఘాజీ పూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆపై ఓ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకి తీసుకెళ్లి దగ్గరుండి మరీ డబ్బులు డ్రా చేయించి, ఆపై పంపించేశారు. మొత్తానికి తన నిర్వాకం వల్ల పదే పది నిమిషాల్లో ఆ యువతి డబ్బుతో ఎంచక్కా అక్కడి నుంచి వెళ్లింది. అయితే దీనిపై పోలీసులు మరోరకమైన వాదన వినిపిస్తున్నారు. అసలు ఆమె యువతి కాదని, ట్రాన్స్ జెండర్ అని వారంటుండగా, కాదు యువతే అని స్థానికులు చెబుతుండటం కొసమెరుపు.

Delhi Girl Topless ATM

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ATM  topless  Delhi Girl  Demonstration Effect  

Other Articles