అరెస్ట్ మీ అంటూ.. పోలీసులకు లొంగిపోయారు Ravi Verma, Nagashekhar surrender before the police

Ravi verma nagashekhar surrender before the police

kannada actors dead, kannada film accident, ravi verma, kannada actor uday, mastigudi, duniya vijay, anil and uday, nagashekar, kannada film shoot, tragedy in film shoot, sandal wood

Ravi Verma, Nagashekhar have surrendered before the Ramanagara police in connection with the deaths of budding actors Uday and Anil.

అరెస్ట్ మీ అంటూ.. పోలీసులకు లొంగిపోయిన డైరెక్టర్

Posted: 11/13/2016 08:35 PM IST
Ravi verma nagashekhar surrender before the police

శాండిల్ వుడ్ సినీపరిశ్రమలో ఒక్కసారిగా ఉల్లిక్కపడిన ఘటన.. అది.. దక్షిణాది చిత్రసీమలో మార్పులకు అవసరమైన సమయది. మాస్తిగుడి చిత్ర షూటింగ్ లో సంభవించిన విషాదం ఒక్కసారిగా అర్టిస్టులు, సినీ పరిశ్రమను నమ్మకున్న వారిని కంటతడి పెట్టించన ఘటన అది. కర్ణాటకలో తిప్పగుండనహళ్లిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి మాస్తిగుడి చిత్రానికి సంబంధించిన ముగ్గురు పోలీస్‌స్టేషన్‌ లో లొంగిపోయారు. మాస్తిగుడి సినిమా దర్శకుడు నాగశేఖర, స్టంట్‌మాస్టర్‌ రవివర్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సిద్ధులు మాగడి పొలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. వీరిని స్థానిక న్యాయస్థానంలో హాజరపరిచారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.

ఈనెల 7న తిప్పగొండనహళ్లి చెరువు వద్ద జరిగిన దుర్ఘటనలో కన్నడ నటులు అనిల్, ఉదయ్‌లు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మాస్తిగుడి సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ సమయంలో హెలికాప్టర్‌ నుంచి చెరువులోకి అనిల్, ఉదయ్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి బెంగళూరు జలమండలి అసిస్టెంట్ ఇంజినీర్ అనసూయ తవరెకెరె పోలీస్‌స్టేషన్‌లో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. దీంతో ‘మాస్తిగూడి’ సినిమా నిర్మాత సుందరగౌడ, దర్శకుడు నాగశేఖర, సహాయ దర్శకుడు సిద్ధు, స్టంట్‌మాస్టర్ రవివర్మ, యూనిట్ మేనేజర్ ఎస్.భరత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మాస్తిగుడి సినిమా యూనిట్‌ షూటింగ్‌ చేయకుండా కర్ణాటక సినిమా అసోసియేషన్‌ నిషేధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ravi verma  nagashekhar  ramanagara  Masti Gudi accident  masti gudi death  sandal wood  

Other Articles