అనంతలో వ్యక్తిపై పోలీసులు విఛక్షణరహిత దాడి Man thrashed up badly by police in ananthapur

Man thrashed up badly by police in ananthapur

anantapur, sai nagar, cudapah, madhusudhan, Man thrashed up badly by police in ananthapur, RBI, new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban, Rs 2,000 note, PM Modi, Narendra Modi, Prime Minister, Facebook, Twitter, War on Black Money, BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

Even Five days after the Prime Minister’s demonetisation announcement, citizens face a lot of problem in collecting and exchanging money from banks and ATMs. police thrashup a man in ananthapur where exchange of words leads him manhandle sub inspector.

ITEMVIDEOS: అనంతలో వ్యక్తిపై పోలీసులు విఛక్షణరహిత దాడి

Posted: 11/13/2016 03:31 PM IST
Man thrashed up badly by police in ananthapur

పెద్ద నోట్లను రద్దు చేయడంతో ప్రజలు పడుతున్న అవస్థలను వ్యవస్థలో లా అండ్ ఆర్డర్ కాపాడుతూ చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. తాము రక్షక భటులం కాదు రా..స భటులం అనే విధంగా వ్యవహరించడం కలకలం రేపుతుంది. ఈ నెల 8న రాత్రి 8 గంటలకు మీడియా ముందుకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన చేసి ఐదు రోజులు గడుస్తున్నా.. అందుబాటులో డబ్బులు లేక, బ్యాంకుల ముందు క్యూ కడుతూ.. ఏటియం చుట్టూ తిరుగుతూ సహనాన్ని కోల్పోవడంలో చిత్రమేమీ లేదు. ఈ క్రమంలో ఎందరో ప్రైవేటు ఉద్యోగులకు 7, 8, 10 తేదీల్లో సాలరీలు వస్తుంటాయి. అటు ఇంటి అద్దెలు, ఇటు పిల్లల ఫీజులు, ఏది సకాలంలో చెల్లించకపోయినా ఇబ్బందులు.. బ్యాంకుల నుంచి రోజుకో పర్యాయం వచ్చే 2 వేల రూపాయలు ఏ మూలకూ చాలక ప్రతిరోజు క్యూ లైన్లో నిలబడి డబ్బును తీసుకోవాలంటూ ఉద్యోగాలకు ఎగనామం పెట్టాలి.

ఇలాంటి పరిస్థితుల్లో సహనం కోల్పోయిన ఓ వ్యక్తి.. తనకు ఎదురవుతున్న భాధను వ్యక్తం చేయడంలో విఫలమయ్యాడు. గత ఐదు రోజులుగా నిత్యం తాను అనుభవిస్తున్న అవస్థలతో సహనం కోల్పోయిన అనంతపురం  సాయినగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని పోలీసులు కిరాతకంగా దాడి చేశారు. విధులు నిర్వహించే పోలీసులే సహనం కోల్పోయి విఛక్షణ రహితంగా దాడి చేసింది చాలక బలవంతంగా జీపు ఎక్కించి స్టేషన్ కు తరలించారు. ఇక స్వామిభక్తిని చాటుకునేందుకు ఓ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. మీరే చూడండీ..

సాయినగర్‌లోని ఎస్‌బీఐ బ్యాంకు వద్ద క్యూ లైన్‌లో లేని ఒక వ్యక్తి సహనం కోల్పోయి ఎస్‌ఐ జనార్దన్ హెచ్చరించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన యువకుడు ఎస్‌ఐపై చేయి చేసుకున్నారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా యువకుడిని చుట్టుముట్టారు. లాఠీలు తీసుకుని ఇష్టానుసారం కొట్టేశారు. ఇద్దరు పోలీసులు యువకుడి చేతులు పట్టుకోగా.. మిగిలిన పోలీసులు లాఠీలతో చితక్కొట్టారు. ఒక కానిస్టేబుల్‌ యువకుడిని రెండుచేతులతో లాఠీ పట్టుకుని పశువును కొట్టినట్టు కొట్టాడు. నడిరోడ్డు మీదే ఇదంతా జరిగింది.

ఇలా నడిరోడ్డుమీదు కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లిన పోలీసులు అతడిని రహస్యప్రదేశానికి తరలించారు. తీసుకెళ్లిన పోలీసులు ఆ యువకుడిని ఏం చేశారో తెలియడం లేదు. ఎస్‌ఐపై యువకుడు చేయి చేసుకోవడం తప్పే . కానీ అతడిని చట్టప్రకారం శిక్షించాల్సిన పోలీసులు ప్రజలంతా భీతిల్లిపోయేలా నడిరోడ్డుపై పశువును కొట్టినట్టు కొట్టారు. ఈ దాడి దృశ్యాలను కొందరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. దాడికి గురైన యువకుడు కడప జిల్లా కమలాపురానికి చెందిన మధుసూదన్ గా గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles