సెల్ఫీ పిల్ల జనాలను సంకనాకించేస్తోంది | Rajasthan lady cheated Men with selfie

Lady cheated men with selfie

woman cheated with selfies, Selfie Cheater, Rajasthan lady cheated Men with selfie , Lady cheats with selfie, Selfie Girl Balckmail, Blackmail girl, Kushboo Sharma selfie

Lady con cheated 150 people across India with Selfie.

ఆ యువతితో సెల్ఫీ మహా డేంజర్ గురూ!

Posted: 11/07/2016 08:40 AM IST
Lady cheated men with selfie

సెల్ఫీ  పిచ్చితో ప్రాణాలు తీసుకుంటున్న తరుణంలో ఇక్కడ సెల్ఫీనే ఆదాయ వనరుగా మార్చేసుకున్న ఓ యువతి లక్షల్లో సంపాదన వెనకేసుకుంది. అందుకోసం ఆ యువతి ఎంచుకున్న రూట్ బ్లాక్ మెయిలింగ్. ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుని, ఆపై సెల్ఫీతో ఒక్క సెల్ఫీ దిగి చుక్కలు చూపిస్తోంది.

రాజస్థాన్ లో జరిగిన ఘటన వివరాళ్లోకి వెళ్లితే... ఆమె పేరు కుష్బూ శర్మ... అందంగా కనిపిస్తుంది. అదే వంద మందికిపైగా యువకులకు శాపమైంది. అందాన్ని ఎరగా వేసి, ధనవంతులను టార్గెట్ గా చేసుకుని వారిని బెదిరిస్తుంది. ఫేస్ బుక్ ద్వారా యువకులతో పరిచయాలు పెంచుకునేది. ఆపై వారిలో ధనవంతులైనవారిని టార్గెట్ చేసి కాఫీ కేఫ్ లు, రెస్టారెంట్లకు ఆహ్వానించేది. వారితో సన్నిహితంగా మెలగుతూ సెల్ఫీలు తీసుకునేది. ఆపై అసలు కథ మొదలు పెట్టి, డబ్బు ఇవ్వకుంటే, అత్యాచారయత్నం కేసు పెడతానని బెదిరించి అందినకాడికి డబ్బు గుంజేది.

ఇదే క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది ఆమెకు పరిచయం కాగా, ఆపై కుష్బూ, అతని ఇంటికి వెళ్లి, రూ. 1.75 లక్షల నగదు, ఐఫోన్ తో పారిపోయింది. కొన్ని రోజుల తరువాత తిరిగి అతనికి ఫోన్ చేసి, తిరిగి మాయమాటలు చెబుతుండటంతో, సదరు న్యాయవాది పోలీసుల సాయంతో వలపన్ని కుష్బూను పట్టుకున్నాడు. ఆమె సెల్ఫీకి బలైన వారి సంఖ్య సరైనేదైనా లేక ఇంకా ఎక్కువ మందే ఉన్నారో తెలుసుకునేందుకు లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan lady  cheat  selfie  blackmail  Kushboo Sharma  Arrest  

Other Articles