యువతి అడగ్గానే మంత్రి ఎంత పని చేశాడు | Jayant Sinha's good samaritan act

Jayant sinha s good samaritan act

Civil Aviation Minister Jayant Sinha, Shreya Pradip twitter, Twitter user thanks Civil Aviation Minister Jayant Sinha, Jayant Sinha's good samaritan act, twittery thanks to Jayant Sinha

Twitter user thanks Civil Aviation Minister Jayant Sinha for swapping seats with her and her ill mom.

యువతి కోసం ఫ్లైట్ లో ఎంత పెద్ద త్యాగం

Posted: 11/07/2016 08:14 AM IST
Jayant sinha s good samaritan act

డిజిటల్ యుగంలో ఎవరైనా, ఎక్కడైనా మంచి, చెడు రెండింటిలో ఏది చేసినా సరే క్షణాల్లో తెలిసిపోతుంది. ఇక వారు చేసిన పనులను బట్టి సోషల్ మీడియాలో రియాక్షన్లు వచ్చిపడుతుంటాయి. తాజాగా కేంద్ర మంత్రి జయంత్ సిన్హా చేసిన పనికి ఓ యువతి చేసిన పోస్ట్ తో వార్తల్లోకి ఎక్కారు.

విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ కోసం కేంద్రమంత్రి జయంత్ సిన్హా తన ఫస్ట్ క్లాస్ సీటును వదులుకుని సాధారణ సీటులో కూర్చుని తన ఔదార్యాన్ని చాటుకున్నారు. బెంగళూరు నుంచి రాంచీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రేయ ప్రదీప్ అనే యువతి తన తల్లితో కలిసి అదే విమానంలో ప్రయాణిస్తోంది. తల్లి కాలికి దెబ్బతగలడంతో ఆమె నడవలేని స్థితిలో ఉంది. దీనికి తోడు విమానంలో వారికి కేటాయించిన సీటు సరిగా లేకపోవడంతో అందులో కూర్చునేందుకు ఆమె ఇబ్బంది పడింది. తల్లి అవస్థ గమనించిన శ్రేయ అదే విమానంలో ప్రయాణిస్తున్న కేంద్రమంత్రి జయంత్ సిన్హా వద్దకు వెళ్లి పరిస్థితి వివరించి తమ సీట్లోకి వెళ్లి ఆ సీటును ఇవ్వాల్సిందిగా కోరింది.

మంత్రి మరేమీ మాట్లాడకుండా భార్యతో కలిసి సీటుమారి వారికి తమ సీటును అప్పగించారు. మంత్రి చేసిన సాయాన్ని శ్రేయ ట్విట్టర్ ద్వారా పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. సిన్హాతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి ‘‘యు ఆర్ వెరీ వెల్‌కమ్’’ అని రీట్వీట్ చేశారు. సుష్మాస్వరాజ్, సురేష్ ప్రభులు ఇప్పటికే వారి చేసే సాయాలతో ఇప్పటికే ట్విట్టర్ లో బాగా పాపులర్ అవుతుండగా, ఆ లిస్ట్ లోకి ఇప్పుడు సిన్హా కూడా వచ్చి చేరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MoS Jayant Sinha  Jayant Sinha twitter  swap seat  ill Mom  

Other Articles