అది మార్చితే.. ఎంఎన్ఎస్ గ్రహచారం మారుతుందా.?. Maharashtra Navnirman Sena To Change Party Symbol

Maharashtra navnirman sena to change party symbol

Raj Thackeray, Maharashtra Navnirman Sena, mns, party symbol, bms corperation elections, Brihanmumbai Municipal Corporation polls

The Maharashtra Navnirman Sena (MNS) is planning to tweak its election symbol ahead of the Brihanmumbai Municipal Corporation (BMC) election.

అది మార్చితే.. ఎంఎన్ఎస్ గ్రహచారం మారుతుందా.?.

Posted: 11/06/2016 07:03 PM IST
Maharashtra navnirman sena to change party symbol

మహారాష్ట్రలో ఓ వెలుగు వెలిగిన రాజ్ థాకరే.. తన పూర్వ వైభవం కోసం తన పార్టీలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి ఏర్పాటు చేయకముందు తనకు శివసేనలో వున్న వైభం వేరు.. శివసేన నుంచి బయటకు వచ్చి పార్టీని స్థాపించిన తరువాత తనకు గుర్తింపు అధికంగా వున్నా.. పార్టీ మాత్రం ప్రజల్లోకి అంతగా వెల్లడం లేదు, దీంతో తన పార్టీ ప్రజల్లో అదరణ లభించాలని కొన్న మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు తన పార్టీ విజయపథాన నడవపోవడానికి అదే కారణమని అయన భావిస్తున్నారా.. అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి.

అందుకనే  త్వరలో జరగనున్న బృహత్‌ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో తన పార్టీ పుంజుకోవాలని భావిస్తున్న ఆయన. ఇందుకోసం తన కొత్త పార్టీ గుర్తుతో బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఈ పార్టీ గుర్తుగా రైలింజన్‌ను దాదాపు ఖరారు చేసినట్టు కొందరు నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఎంఎన్ఎస్‌ పార్టీ మహారాష్ట్రలో గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. 2009లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 13 స్థానాలు సాధించిన ఎంఎన్ఎస్, 2013లో మాత్రం కేవలం ఒక స్థానం సాధించి పూర్తిగా చతికలపడిన విషయం తెలిసిందే.

పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికే గుర్తు మారుస్తున్నారని పార్టీ నాయకులు భావిస్తున్నప్పటికీ కారణాలు మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఆర్టిస్టులపై నిషేధం విషయంలో ఎంఎన్ఎస్ నేతలు వీరంగం సృష్టించారు. థియేటర్ల యాజమాన్యాన్ని బెదిరించడం, బాలీవుడ్ దర్శకనిర్మాతలను హెచ్చరిస్తూ వ్యవహారాన్ని పెద్దది చేయడంతో.. ఇండస్ట్రీకి చెందిన కొందరు ఏకంగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆశ్రయించారు. చివరికి కరణ్ జోహర్ తీసిన మూవీ విడుదలై రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తోంది. పార్టీ గుర్తు మార్చితే.. బీఎంసీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ ఫేట్ మారుతుందో లేదో తెలియాలంటే ఆ ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raj Thackeray  Maharashtra Navnirman Sena  mns  party symbol  bms corperation elections  

Other Articles