మేమే రంగంలోకి దిగుతాం: పాక్ కు అమెరికా హెచ్చరికలు ‘ISI not acting against all terrorist groups in Pakistan’

Isi not acting against all terrorist groups in pakistan

us, pakistan, afghanistan, haqqani network, terrorist groups, adam jubin, america on pakistan, us warns pakistan, pakistan terror groups, isi, pakistan america, america pakistan, american on pakistan

The US has warned Pakistan that it would not hesitate to destroy the terror networks in the country, if its spy agency does not act against terrorist groups themselves.

మేమే రంగంలోకి దిగుతాం: పాక్ కు అమెరికా హెచ్చరికలు

Posted: 10/24/2016 09:11 AM IST
Isi not acting against all terrorist groups in pakistan

ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశంగా మారిన దాయాధి పాకిస్థాన్‌ను మరోమారు అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. ఉగ్రవాదంపై ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించింది. ఉగ్రవాదానికి స్వర్గధామంగా మారిన పాకిస్థాన్ లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను నేలమట్టం చేసేందుకు తానే స్వయంగా చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడబోననని తేల్చిచెప్పింది. పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్) తమ దేశంలో ఉన్న ఉగ్రవాద గ్రూపులన్నింటిపై చర్యలు తీసుకోవడం లేదని, ఈ నేపథ్యంలో తానే స్వయంగా రంగంలోకి దిగాల్సి రావొచ్చునని తేల్చిచెప్పింది.

'తమ భూభాగంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లన్నింటిపైనా కఠినంగా వ్యవహరించమని మేం భాగస్వామి అయిన పాకిస్థాన్‌ను కోరుతూ వస్తున్నాం. వారికి సాయం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదులకు నిధులను అడ్డుకోవడంలో, వారి కార్యకలాపాలు నిలువరించడంలో పాకిస్థాన్‌కు మా సహకారం ఉంటుందనే విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదని ఉగ్రవాదానికి ఆర్థిక మద్దతును అడ్డుకునే అంశంలో అండర్‌ సెక్రటరీగా ఉన్న ఆడమ్ జుబిన్ పేర్కొన్నారు.

పాకిస్థాన్‌లో క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవడానికి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) నిరాకరిస్తున్నది.  కొన్ని ఉగ్రవాద గ్రుపుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. అదే సమయంలో ఈ ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయడానికి అమెరికా స్వయంగా రంగంలోకి దిగడానికి ఏమాత్రం వెనుకాడబోదు' అని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్‌ తమ కీలక భాగస్వామిగా కొనసాగుతుందనే విషయాన్ని స్పష్టం చేస్తూనే.. అవసరమైతే తామే స్వయంగా ఉగ్రవాద గ్రూపుల భరతం పడతామని ఆయన స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : us  pakistan  afghanistan  haqqani network  terrorist groups  adam jubin  

Other Articles