మావోలకు భారీ దెబ్బ... ఆంధ్రా-ఒడిశా బార్డర్ లో ఎన్ కౌంటర్.. కీలక నేతలతోసహా 23 మంది మృతి | 19 Maoists Killed In Encounter At Andhra-Odisha Border

19 maoists killed in encounter at andhra odisha border

AOB encounter, 19 Maoists Killed in Andhra-Odisha Border, 19 Maoists Killed and 2 Policemen Injured In Encounter, Malkangiri encounter, Malkangiri, AOB encounter, Maoist Uday killed, Maoist Uday encounter, Maoist Ashok escaped

19 Maoists Killed and 2 Policemen Injured In Encounter At Andhra-Odisha Border.

ఏవోబీలో బారీ ఎన్ కౌంటర్... కీలక నేతలతోసహా 23 మంది మృతి!

Posted: 10/24/2016 09:09 AM IST
19 maoists killed in encounter at andhra odisha border

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులకు భారీ దెబ్బ పడింది. మల్కాన్ గిరి జిల్లాకు 10 కి.మీ. దూరంలో ఏవోబీ ప్రాంత సమీపంలో సోమవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 23 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టుల కీలక సమావేశాలు జరుగుతున్నట్లు సమాచారంతో ఏపీ-ఒడిశా గ్రేహౌండ్ పోలీసు బలగాలు సంయుక్తంగా నిన్నటి నుంచి కూంబింగ్ చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో అణువణువునా జల్లెడ పట్టాయి.

ప్లీనరీ సమావేశం కోసం సుమారు 50 నుంచి 60 మంది మావోలు ఓ చోట గుమిగూడిన విషయం తెలుసుకుని అక్కడికి చేరేందుకు ప్రయత్నించాయి. అయితే పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరపటంతో ప్రతిగా పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. వీరిలో 8 మంది మహిళా మావోలు కూడా ఉన్నట్లు సమాచారం.

ఏవోబీ అగ్రనేత ఉదయ్ మృతి చెందినట్లు నిర్థారణ అయ్యింది. కిరణ్, సుధాకర్ లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ కుమారుడు మున్నా కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  ఈ ఘటనలో 15మంది మావోయిస్టులు కూడా ఉదయ్ దళానికి చెందిన వారే అని తెలుస్తోంది. ఘటనా స్థలంలో నాలుగు ఏకే-47లతో సహా భారీ పెద్దన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

మృతుల్లో మరికొందరు కీలక నేతలు ఉన్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కీలక నేత గాజర్ల అశోక్ అలియాస్ గణేశ్ సహా తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాలను గుర్తించేందుకు మాజీ మావోల సహకారం తీసుకుంటున్నారు. మరోవైపు ఇద్దరు గ్రేహౌండ్స్ పోలీసు కానిస్టేబుల్స్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా విశాఖకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూబింగ్ మరింత ఉధృతం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malkangiri  Encounter  19 Maoists Killed  2 policemen injured  

Other Articles