హఫీజ్ సయీద్పై చర్యలు లేవి.? ప్రభుత్వం విఫలం: పాక్ ఎంపీ take action against hafeez saeed demands pak lawmaker

Which egg is hafiz saeed laying for us pakistan mp rana muhammad afzal asks

Pakistan Muslim League-Nawaz lawmaker, PML-N) lawmaker, Rana Muhammad Afzal, hafeez sayeed, Jamaat-ud-Dawa (JuD), Lashkar-e-Taiba, chief Hafiz Saeed, terror groups, Pakistan. Pakistan's foreign policy

A Pakistan Muslim League-Nawaz (PML-N) lawmaker has called for action against Jamaat-ud-Dawa (JuD) chief Hafiz Saeed+ amid a growing chorus for action against terror groups.

హఫీజ్ పై చర్యలు లేవి.? ప్రభుత్వం విఫలం: పాక్ ఎంపీ

Posted: 10/07/2016 07:18 PM IST
Which egg is hafiz saeed laying for us pakistan mp rana muhammad afzal asks

జమాత్ ఉద్ దవా చీఫ్, లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్పై చర్యలు తీసుకోవడంలో పాకిస్థాన్ పూర్తిగా విఫలమైందని పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీ ఎంపీ  రానా మహ్మద్ అఫ్జల్ తూర్పారబట్టారు. భారత్లో ఉగ్రకార్యకలాపాల్లో హఫీజ్ సయీద్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నా.. అతడిపై చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఎందుకింకా మీనమేషాలు లెక్కిస్తుందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వున్న ఆయన అ సమావేశంలో పాల్గోని పాకిస్తాన్ ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. హఫీజ్ ఉగ్రవాది అనే విషయాన్ని భారత్ ప్రపంచవ్యాప్తంగా వెల్లడించిందని.. అలాంటి వ్యక్తి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. హఫీజ్ సయీద్ ను పెంచిపోషిస్తున్నందుకు అతను మనకు ఏమైనా అంతర్జాతీయంగా లాభాలన్ని చేకూర్చుతున్నాడా.? అని ప్రశ్నించాడు.

ఉగ్రవాదం విషయంలో చర్యలు తీసుకోవడం ద్వారా పాక్ను టెర్రరిస్ట్ స్టేట్గా ప్రకటించి ఒంటరిని చేయాలన్న ప్రపంచదేశాల ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. ప్రభుత్వ విధానాల వల్ల అంతర్జాతీయంగా ఇప్పటికే పాకిస్తాన్ ఒంటరైందని అయన విమర్శించారు, అటు విదేశీ వ్యవహారాల్లో పాకిస్తాన్ అవలంభిస్తున్న విధానాన్ని సైతం అఫ్జల్ ఎండగట్టారు. అప్జల్ తో పాటు రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి మరీ పలువురు నేతలు దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలంటూ పిలుపునిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rana muhammad afzal  law maker  hafeez saeed  LeT  JuD  pakistan  

Other Articles