మళ్లీ హల్ చల్.. పోలీసులపై చిందులేసిన చింతమనేన mla chintamaneni disrupts police from performing their duties

Mla chintamaneni disrupts police from performing their duties

chinthamaneni prabhakar, chinthamaneni hulchul, chinthamaneni disrupts police duties, chinthamaneni traffic police, tdp mla distrupts police duties, denduluru mla, tdp mla, Traffic police, west godavari, crime

west godavari denduluru mla chintamaneni prabhakar disrupts traffic police from performing their duties, stopped them from challaning offenders.

మళ్లీ హల్ చల్.. పోలీసులపై చిందులేసిన చింతమనేని

Posted: 10/03/2016 01:44 PM IST
Mla chintamaneni disrupts police from performing their duties

అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే మరోమారు హల్ చల్ చేశారు. విధి నిర్వహణలో వున్న పోలీసులను విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారు. ఇలా ఎవరు చేయగలరూ..? అలా చేశారంటే ఆయన ఖచ్చితంగా పశ్చిమగోదావరి జిల్లా శాసనసభ్యుడేనని నిర్ధారణకు వచ్చేశారు కదూ. అవునండీ మీరు ఊహించినట్లుగానే ఆయన పగో జిల్లాకు చెందిన దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకరే. గతంలో మండల రెవెన్యూ అధికారి, ఆ తరువాత పారెస్టు అధికారులు, ఆనంతరం ఓ పోలీసు కానిస్టేబుల్ ఇలా పలువురి విధులకు అటంకం కలిగించినట్లుగా అభియోగాలను ఎదుర్కోన్న  ఆయన మరోసారి రెచ్చిపోయారు.

వాహనాల చట్టాన్ని అతిక్రమించి అక్రమంగా వెళ్తున్న వాహనదారులను టార్గెట్ చేసిన పోలీసులు వారు మరోమారు అలా చేయకుండా వుండేందుకు చానాలాలు రాస్తుంటారు. అలానే ఇవాళ కూడా ఏలూరు పాత బస్టాండ్ వద్ద చలానా రాస్తున్న ఏలూరు ట్రాఫిక్ పోలీసులపై చిందులు వేశారు. చలాన్లు ఎందుకు రాస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చలాన్లు చెల్లించడానికి వచ్చిన ప్రజలను చింతమనేని అక్కడి నుంచి పంపించారు. గతంలోనూ ట్రాఫిక్ చలాన్లు రాయొద్దంటూ పోలీసులను చింతమనేని హెచ్చరించారు. విధులకు ఆటంకం కలిగించిన చింతమనేనిపై ట్రాఫిక్ పోలీసులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తరచూ విధులకు ఆటంకం కలిగిస్తే ఉద్యోగాలు చేయలేమంటూ ట్రాఫిక్ సిబ్బంధి వాపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chinthamaneni prabhakar  denduluru mla  tdp mla  Traffic police  west godavari  crime  

Other Articles