చిన్న చేపను పట్టుకుని పెద్ద డ్రామా..? ఎందుకమ్మా..? PDS salesman earns Rs 1,200 a month, owns Rs 50 lakh property

Why lokayukta gives higher priority to pds salesman owning rs 50 lakh property news

Suresh Pandey, salesman, salary Rs 1, 200, crorepati, Bhopal, PDS salesman, Rs 50 lakh property, MP, disproportionate assets

Lokayukta special police establishment raided the premises of a public distribution shop (PDS) salesman in Sidhi district after they received a tip-off that he had amassed disproportionate assets.

చిన్న చేపను పట్టుకుని పెద్ద డ్రామా..? ఎందుకమ్మా..?

Posted: 09/29/2016 08:03 PM IST
Why lokayukta gives higher priority to pds salesman owning rs 50 lakh property news

అవినీతి సముద్రంలో సోరచేపలను, తిమింగలాలను వదలి చిన్న చేపను పట్టుకుని చెంతాడంత మీడియా కవరేజ్ ఇవ్వడం అవసరమా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం కావాల్సిన అవసరం మెదలయ్యింది. బీజేపి పాలిత మధ్యప్రదేశ్ లో అవినీతి నిరోధక వ్యవస్థగా వున్న లోకాయుక్త.. ఓ మద్య తరహా కుటుంబానికి చెందిన వ్యక్తి లక్ష్యాధికారి తేలడంతో ఆయన గురించి విపరీతమైన హైఫ్ క్రియేట్ చేయడం అవసరమా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ మేం చెబుతున్నదెవరి కోసమో తెలుసుగా..

క్రితం రోజున మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో ఓ పౌరసరఫరా దుకాణంలో పనిచేస్తున్న సురేశ్ ప్రసాద్ పాండే అనే వ్యక్తిని లోకాయుక్తకు చెందిన పోలీసులు అరెస్టు చేశారే అతడి గురించే. అతడు నెల వేతనం రూ.1,200. కానీ అనూహ్యంగా అతడు లక్షాధికారి అయ్యాడని వారు తేల్చారే అతగాడి గురించే. అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడని, అతడిపై అనేక పిర్యాదులు అందడంతో తాము అతడి ఇంటిపై దాడులు నిర్వహించగా అతడి సంపాదన కన్నా వందల సార్లు అధికమై అస్తులు బయటపడ్డాయని లోకాయుక్త అధికారులు వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది,

రూ.1200 నెలసరి వేతనంతో అతడు లక్షాధికారి ఎలా అయ్యాడు, అని కూపీ లాగిన లోకాయుక్త పోలీసులు అతడు అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడని కూడా తేల్చారు. అయితే అతను కనీసం రేషన్ దుకాణం అలాటీ కూడా కాదు. దీంతో అతను నిత్యవవసర సరుకులను పక్కదారిలో విక్రయించే అవకాశం కూడా లేదు. అయితే అతడు ఎలా అక్రమాస్థులను సంపాదించాడన్న అనుమానాలను మాత్రం లోకాయుక్త వెల్లడించలేదు, దీనికి తోడు అతడి వద్ద ఒక బొలేరో, ఆల్టో కార్లను, యాక్టివా, హోండా షైన్ బైక్ లు కూడా వుండటంతో వాటిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అధికారుల సోదాల్లో ఈ విసయాలు బయటపడటంతో దీనికి మీడియా కూడా మంచి ప్రాధాన్యతనే ఇచ్చింది. అయితే సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ.. అక్రమంగా పెద్ద పెద్ద అస్తులను కూడబెడుతున్న వారిని వదిలి చిన్న చేపను పట్టకుని పెద్దగా ప్రచారం చేయడంలో లోకాయుక్త అంతర్యమేమిటీ అన్నదే అర్థం కావడం లేదు. బహుశా ఈ ఘటనతో మధ్యప్రదేశ్ సర్కార్ ఇక తాము సామాన్యులు, పేదలను కూడా అక్రమాస్థుల విషయంలో టార్గట్ చేయనున్నామన్న సంకేతాలను ప్రజల్లోకి పంపుతుందా..? ఈ హైప్ తో యావత్ భారతంలోని ప్రజలకూ ఈ సంకేతాలు వెలువడేలా చేసిందా..? అన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles