దక్షిణాది ప్రజలకు కేంద్రం దసరా, దీపావళికి వాయింపులు.. Railway charges to cost double and more during festival

Railway charges to cost double and more during festival

South Central Railway, suvidha trains, tickets fare on availability, scr announcement, platform tickets, Secunderabad Railway station, Railway platform tickets rates doubled, temporary inrease in platform tickets, hike in platform tickets

The SCR has announced that from Oct. 1, train nos. 17644/17643 Kakinada Port-Chennai Egmore Circar express and nos. 17652/17651 Kacheguda-Chennai express would be extended till Chengalpattu.

పండగ పూట రైలు ప్రయాణం అంత ఈజీ కాదు సుమీ..!

Posted: 09/29/2016 09:03 AM IST
Railway charges to cost double and more during festival

సందెట్లో సడేమీయా అన్నట్లుగా తయారైంది రైల్వే ప్రయాణ వ్యవస్థ. భారతీయ ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చాలన్న ఉద్దేశ్యంతో సుదూర ప్రయాణాలను కూడా కారుచౌకగా అందించాలని దేశవ్యాప్తంగా ఒకే విధానంతో ప్రారంభమైన రైలు ప్రయాణాలు ఇక తమ లక్ష్యాన్ని దూరం చేసుకుంటున్నాయి. లక్ష్యాన్ని వదిలి లాభాలను అర్జించేందుకు మొగ్గుచూపుతుంది. అది కూడా ఎంతలా అంటే సందు దొరికితే చాలు.. వాయింపులను ఒడ్డించేందుకు సిద్దమైంది. అప్పో, సప్పో చేసి తమ కన్నవాళ్ల వద్దకు వెళ్లి పండగ జరుపుకోవాలని అశపడే వారి ఆశలు ఇక అడియాశలు కానున్నాయ్.

ఇప్పటికే ఫ్లాట్ ఫామ్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. ఇక ప్రయాణికులను వాయించేందుకు కూడా సిద్దమైంది. ఒకవైపు ఏడాదికి పైగా వివిధ రూట్‌లలో ‘సువిధ’ పేరుతో నడుపుతున్న రైళ్లలో చార్జీలను రెట్టింపు చేయగా, ఇటీవల ‘ఫ్లెక్సీ ప్రైస్’ పేరుతో రాజధాని, దురంతో, శతాబ్ది రైళ్లలో చార్జీల మోత మోగించారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు ప్రతి 10 శాతం బెర్తులపైన భారాన్ని పెంచేశారు. తాజాగా దసరా, దీపావళి, తిరుమల బ్రహ్మోత్సవాల పేరిట అక్టోబర్, నవంబర్ నెలల్లో నడుపనున్న 52 ప్రత్యేక రైళ్లను సైతం వదిలి పెట్టకుండా సాధారణ చార్జీల స్థానంలో ’తత్కాల్‌‘ చార్జీలు విధించి అదనపు దోపిడీకి తెరలేపారు.

తిరుమల బ్రహోత్సవం, దసరా, దీపావళి పర్వదినాల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ మేరకు 52 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను సిద్ధం చేసింది. కానీ, ఈ ప్రత్యేక రైళ్లన్నింటికీ తత్కాల్ చార్జీలు వర్తించనున్నాయి. హైదరాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-మైసూర్, సంత్రాగచ్చి (కోల్‌కతా) -సికింద్రాబాద్, సికింద్రాబాద్-విజయవాడ మధ్య, సికింద్రాబాద్- పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ రెండో వారం వరకు ఇవి నడుస్తాయి.

దీంతోపాటు సెలవుల దృష్ట్యా రద్దీ ఉండే మార్గాల్లో 53 ‘సువిధ’ రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. దీంతో ప్రయాణికులపై సాధారణ చార్జీలపైన రెట్టింపు భారం పడనుంది. ఈ రైళ్లను విశాఖ-సికింద్రాబాద్, తిరుపతి-సికింద్రాబాద్‌లో మార్గాల్లో వేసవి సెలవుల సందర్భంగా ఏప్రిల్, మే, జూన్ నెల ల్లో నడుపనున్నారు. గతంలో ప్రీమియం రైళ్ల పేరుతో బెర్తుల బేరానికి దిగిన రైల్వే ఇప్పుడు ‘సువిధ’గా పేరు మార్చుకుంది. ఈ రైళ్లలో సాధారణ చార్జీలు ఉండవు. ఏసీ,నాన్ ఏసీ బోగీల్లో తత్కాల్‌తోనే చార్జీలు మొదలవుతాయి. అడ్వాన్స్ బుకింగ్‌లు పెరిగి, బెర్తులు నిండుతున్న కొద్దీ చార్జీలు పెరుగుతాయి. మొదట తత్కాల్‌తో ప్రారంభమై ఆ తరువాత క్రమంగా పెరుగుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles