షారూఖ్ ఖాన్ సినిమా కళ్ల ముందు... | Mumbai man protest at PS that he was not terrorist

Mumbai man protest at ps that he was not terrorist

Virar Man, My Name is Khan I am not a terrorist in Mumabi, Sharukh movie in Mumbai, Man protest that he was not terrorist, Mumbai man trouble with whats app post, Whats app mumbai man

A Muslim youth at Virar in Palghar district has complained to the police after he was labelled a terrorist in a WhatsApp message that went viral. Saeed Khan (30) on Tuesday went to the Virar police station to complain against the message that showed him with a friend Khashid Khan on a bike with the message that he is a terrorist.

అచ్చం షారూఖ్ సినిమాలోలాగానే...

Posted: 09/29/2016 09:12 AM IST
Mumbai man protest at ps that he was not terrorist

షారూఖ్ ఖాన్ సినిమా మై నేమ్ ఈజ్ ఖాన్ గుర్తుందా? అందులో ముస్లిం అయినందుకు షారూఖ్ ను టెర్రరిస్ట్ గా అనుమానించి అవమానిస్తుంటారు అమెరికా పోలీసులు. ఆ క్రమంలో అతని కొడుకు కోల్పోయి, భార్యను దూరం చేసుకుని, చివరకు ఒబామాను కలిసి మై నేమ్ ఈజ్ ఖాన్ ఐ యామ్ నాట్ ఏ టెర్రరిస్ట్ అని చెబుతుంటాడు. సరిగ్గా ఇప్పుడు అలాంటి సంఘటనే ఇప్పుడు ముంబైలో నిజంగా చోటుచేసుకుంది. సోషల్ మీడియా వాట్సాప్‌లో కొందరు అప్‌లోడ్ చేసిన ఫొటో ఓ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది.

ముంబైకి చెందిన షేర్ అలీఖాన్(30) డ్రైవర్. విరార్ ప్రాంతంలో భార్య, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఈ నెల 22న అతడు తన బైక్‌పై బయటకు వెళ్లినప్పుడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతడి ఫొటో తీసి ‘టెర్రరిస్ట్’ అని రాసి వాట్సాప్‌లో అప్‌‌లోడ్ చేశారు. ఇది చూసిన బంధువుల నుంచి తెలిసిన వారి వరకు అందరూ అలీకి ఫోన్ చేసి ‘నువ్వు టెర్రరిస్టువా’ అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అందరూ అదే పనిగా ఆ ప్రశ్నే అడుగుతుండడంతో భయంతో ఏం చేయాలో పాలుపోని అలీ ఇంటికే పరిమితమయ్యారు. బయటకు వస్తే దాడి చేసే అవకాశం ఉందన్న భయంతో ఐదు రోజులపాటు ఇంట్లోనే గడిపిన ఆ కుటుంబం ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంది.

చివరికి ధైర్యం తెచ్చుకున్న అలీ ‘నాపేరు ఖాన్.. నేను ఉగ్రవాది కాను’ అనే ప్లకార్లు చేతబట్టి భార్య పిల్లలతో సహా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఫొటోను తీసి ఉగ్రవాది అంటూ వాట్సాప్‌లో పెట్టారని ఫిర్యాదు చేశాడు. దీంతో తన కుటుంబం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, దాడి చేస్తారన్న భయంతో క్షణమొక యుగంగా గడుపుతున్నామని పేర్కొన్నాడు. తానుంటున్న అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేయాలని కొందరు తనను బెదిరిస్తున్నారని, ఇది వారి పనే అయి ఉండొచ్చంటూ ఏడుగురిపై ఫిర్యాదు చేశాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని తనను, తన కుటుంబాన్ని రక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai Man  Ali Sharkhan  whats app  I am not a terrorist  

Other Articles