మహేష్ బాబును అరెస్టు చేసిన పోలీసులు.. నగ్నదృశ్యాలతో బ్లాక్ మెయిల్ mahesh babu arrested for blackmailing woman with nude films

Mahesh babu arrested for blackmailing woman with nude films

mahesh babu srikakulam, mahesh babu amudalavalasa, mahesh babu arrest, nude films blackmailing, maheshbabu parlour owner, mahesh babu blackmailing women, nude films,

mahesh babu a internet cafe cente owmer at amudalavalasa of srikakulam district arrested on allegations of filming girls nude bits and blackmailed them for money and sex

మహేష్ బాబును అరెస్టు చేసిన పోలీసులు.. నగ్నదృశ్యాలతో బ్లాక్ మెయిల్

Posted: 09/27/2016 10:26 AM IST
Mahesh babu arrested for blackmailing woman with nude films

మేక వన్నె పులులు అణువణువునా పోంచి వుంటాయని అనేక మంది అమాయక అడపడచుల జీవితాలు నిరూపిస్తున్నా.. యవ్వనమోజులో వాటిని పట్టించుకోకుండా తిరుగుతూనే వున్నారు. ఇలాంటి వారని మాటు వేసి పట్టుకుని వారి నయానో, భయానో తమ బట్టులో వేసుకుని తమ అవసరాలకు అనుగూణంగా మార్చుకునే గోముఖవ్యాఘ్రాలు ఇంకా పురుషాధిక్య సమాజంలో సంచరిస్తూనే వున్నాయన్న విషయం అర్థమయ్యే సరికి అంతా జరిగిపోయిందని అంగలార్ఛడం మాత్రమే మిగిలివుంటుంది.

సరిగ్గా ఇలాగే మహిళలను మాటువేసి.. మాయమాటలతో లోబరుచుకుని ఆపై వారి నగ్నదృశ్యాలను చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేస్తూ వచ్చిన మహేశ్‌బాబు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన చింతాడ మహేశ్‌బాబు ఇంటర్‌నెట్ సెంటర్ నడుపుతున్నాడు. సెంటర్‌కు వచ్చే మహిళలకు మాయమాటలు చెప్పి లోబరుచుకునేవాడు. మహేశ్ మాయమాటలకు లొంగిపోయిన మహిళలను ప్రలోభాలకు గురిచేసేవాడు. ఈ క్రమంలో ఓ వివాహిత, మరికొందరి యువతుల నగ్న దృశ్యాలను వీడియో తీశాడు. తీసిన వీడియోలను తన కంప్యూటర్‌లో భద్రపరిచాడు.

తర్వాత వాటిని స్నేహితులకు షేర్ చేశాడు. యూట్యూబ్‌లోనూ అప్‌లోడ్ చేశాడు. అనంతరం స్నేహితుల సహకారంతో బాధిత మహిళలను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. వారి నుంచి రూ.లక్షల్లో డిమాండ్ చేశాడు. షేర్ అయిన వీడియోలు యువకుల సెల్‌ఫోన్లలో హల్‌చల్ చేయడంతో జిల్లాలో కలకలం రేగింది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలించారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న మహేశ్‌బాబును సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి సహకరించిన సీపాన రమేష్, సంతోష్, వెంకటరావులను కూడా అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ బ్రహ్మారెడ్డి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  blackmailing women  nude films  amudalavalasa  srikakulam  crime  

Other Articles