ఆ పులికి హిందీ అంటే అస్సలు పడటం లేదు | Udaipur bound White Tiger understands only Tamil

Udaipur bound white tiger understands only tamil

Udaipur bound White Tiger Ramu, White Tiger Ramu understands only Tamil, White Tiger Hindi Tamil, tiger comfort with tamil language, White Tiger Roar, White Tiger Hates Hindi, udaipur White Tiger Ramu

Udaipur bound White Tiger Ramu understands only Tamil.

హిందీ మాట్లాడితే గుండెలు దద్దరిల్లుతున్నాయి...

Posted: 09/27/2016 09:38 AM IST
Udaipur bound white tiger understands only tamil

భాష మనుషులకే కాదు జంతువులకు కూడా తంటాలు తెచ్చిపెడుతోంది. కావాలంటే ఇది చదవండి. తమిళనాడు జూలో పుట్టిపెరిగిన తెల్లపులి ఒకటి హిందీ భాషలో మాట్లాడితే గుండెలదిరిపోయేలా గాండ్రిస్తోంది. తమిళ భాషలో ఆదేశాలిస్తేనే పాటించే ఈ తెల్లపులి, హిందీ భాషలో మాట్లాడితే మాత్రం గాండ్రింపులే.. గాండ్రింపులు! ఇంతకీ, ఈ తెల్లపు కథేమిటంటే...

రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ లోని సజ్జన్ ఘర్ జూపార్క్ లో ‘ధామిని’ అనే ఆడ తెల్లపులి ఉంది. అయితే, ఈమధ్య కాలంలో అది వయసుకొచ్చింది. దానికి సరైన జోడీ కోసం దేశంలోని అన్ని ‘జూ’ల నుంచి ఆ జూపార్కు అధికారులు సమాచారం సేకరించారు.చివరకు, చెన్నైలోని వండలూరు జూపార్కులో ‘రామ’ అనే మగ తెల్లపులిని గుర్తించారు. వస్తుమార్పిడి విధానం లాగానే, జంతుమార్పిడి విధానం కింద ఆ మగ తెల్లపులిని తీసుకువచ్చేందుకు ఉదయ్ పూర్ ‘జూ’ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో రెండు నక్కలను వండలూరు జూ పార్క్ కు ఇచ్చి, ఆ పులిని తెచ్చుకున్నారు. ఇక్కడి దాకా బాగానే ఉంది.. కానీ, అసలు సమస్య ఉదయ్ పూర్ ‘జూ’ అధికారులకు ఇక్కడే మొదలైంది.

ఎందుకంటే, తమిళభాషలో మాట్లాడితే కానీ ‘రామ' ఏమీ తెలుసుకోలేదు. ఉదయ్ పూర్ అధికారులకా భాష రాదు. దీంతో, హిందీ భాషలో వారు ఆదేశాలిస్తుండటంతో, ఆ భాష అర్థంకాని ‘రామ’కు చిర్రెత్తుతోంది. ‘ఆవో’.. అంటే గాండ్రుమంటోంది.. ‘జావో’ అంటే మరింతగా గాండ్రిస్తోంది. దీంతో, తలలు పట్టుకున్న అధికారులకు ఒక ఆలోచన వచ్చింది. తమిళ భాష తెలిసిన సిబ్బందిని తమకు కేటాయించాలని వండలూరు జూపార్క్ అధికారులకు ఉదయ్ పూర్ జూపార్క్ సూపరింటెండెంట్ మోహన్ రాజ్ ఇటీవల ఒక లేఖ రాశారు.

అయితే తమిళం తెలిసిన సిబ్బంది వచ్చే దాకా ‘రామ’కు తిప్పలు తప్పవు.. తమకు దాని గాండ్రింపులు వినక తప్పదని ఉదయ్ పూర్ ‘జూ’ సిబ్బంది అంటున్నారు. అయితే, ‘భాష’ సమస్య కాదు, స్థలం మారడం వలనే దానికి కొంచెం కొత్తగా ఉందని కొందరు అంటున్నారు. కాగా, 2011లో వండలూరు ‘జూ’లో ‘రామ’ జన్మించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : White Tiger  Ramu  Tamil  Hindi  Udipur Zoo  

Other Articles