పాకిస్థాన్ పై ప్రధాని మోదీ వైఖరిపై దేశప్రజల అసంతృప్తి Half of Indians disapprove of Modi’s Pakistan policies

Half of indians disapprove of modi s pakistan policies survey

narendra modi, pakistan, jammu and kashmir, modi kashmir, pm modi kashmir, moid kashmir remark, modi on kashmir, J and K all party delrgates, modi pakistan, pakistan modi, modi pakistan policy, pew research india, pew survey india, india pakistan policy, pakistan news

A survey published recently on Indian attitudes shows that nearly 50 percent of respondents across the border do not approve of Indian PM Modi’s policies concerning Pakistan.

పాకిస్థాన్ పై ప్రధాని మోదీ వైఖరిపై దేశప్రజల అసంతృప్తి

Posted: 09/25/2016 09:06 AM IST
Half of indians disapprove of modi s pakistan policies survey

ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికలకు ముందు ప్రసంగాలతో దేశ ప్రజలను మనస్సులను చూరగోన్నాడు కానీ, ఆయన పాలనలో ఆశించిన మేరకు ఫలితాలు రావడం లేదంటూ యావత్ భారతావని అభిప్రాయపడుతుంది అని స్పష్టమైంది. ముఖ్యంగా పొరుగునే ఉండి ఇండియాలో విధ్వంసానికి దిగుతూ పక్కలో బల్లెంలా మారిన పాకిస్థాన్ పై మోదీ అవలంబిస్తున్న విధానం పట్ల అత్యధిక భారతీయులు అసంతృప్తితో ఉన్నారని అమెరికన్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

పాకిస్థాన్ కు బుద్ధి వచ్చేలా మోదీ ఏమీ చేయట్లేదని, అయినా గాంధీలతో పోలిస్తే, ప్రధానిగా మోదీ సమర్థుడని ప్రజలు అభిప్రాయపడుతున్నారని సర్వే నిర్వహించిన 'ప్యూ' పేర్కొంది. తమ సర్వేలో భాగంగా మొత్తం 2,464 మందిని ప్రశ్నించామని, ఇండియాలో నేరాల సంఖ్య పెరగడం అతిపెద్ద సమస్యని 82 శాతం మంది చెప్పారని, ఉద్యోగావకాశాలు లభించడం లేదని 81 శాతం, అధికారుల్లో అవినీతి పేరుకుందని 80 శాతం,, ఉగ్రవాదం పెను సమస్యేనని 78 శాతం మంది సర్వేలో పాల్గొన్న వారు చెప్పారని పేర్కొంది.

అమెరికాతో మోదీ స్నేహబంధం పట్ల 54 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేయగా, పాకిస్థాన్ తో మోదీ వైఖరి అసంతృప్తిగా ఉందని 50 శాతం మంది, బాగుందని 22 శాతం మంది, ఇప్పుడే చెప్పలేమని 28 శాతం మంది చెప్పారు. ఇక దేశాన్ని నడిపించే నేతగా తొలి ఆప్షన్ మోదీయేనని 81 శాతం మంది, సెకండ్ ఆప్షన్ గా సోనియా (65 శాతం), ఆపై రాహుల్ (63 శాతం మంది)ను సర్వేలో పాల్గొన్న వారు ఎంచుకున్నారని 'ప్యూ' వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  mann ki baat  indian army  jammu and kashmir  pakistan  

Other Articles