గుజరాత్ లో దారుణం.. గర్భణీ స్త్రీ, కుటుంబసభ్యుల.. Dalit family, including pregnant woman, attacked

Dalit family including pregnant woman attacked in gujarat

dalit, cow, gujarat, pregnant dalit woman, brahmins, crime, dalits attacked, dalits, gujarat dalits attacked, dalits cow carcass, gujarat, cow, cow carcasss, dalit cow carcasss, dalit gujarat, cow dalits gujarat, pregnant woman gujarat,

Dalits attacked: Police said that the victims were assaulted by the accused belonging to the dominant upper caste community in Mota Karja village.

గుజరాత్ లో దారుణం.. గర్భణీ స్త్రీ, కుటుంబసభ్యుల..

Posted: 09/25/2016 09:58 AM IST
Dalit family including pregnant woman attacked in gujarat

గుజరాత్ లో మరోసారి దారుణం జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా గోవుల కన్నా మనుషులు ప్రధానం అని పిలుపునిచ్చినా.. ఆయన సొంతరాష్ట్రంలోనే గోవు వివాదం రగులుకుంది. తమ పొలంలో చనిపోయిన గోవు కళేబరాన్ని తీసేందుకు నిరాకరించిన ఓ దళిత గర్భిణీ స్త్రీ, ఆమె భర్త, మరో వ్యక్తిపై కొందరు అగ్రకులస్తులు దాడి చేశారు. వారిని తీవ్రంగా గాయపరచడంతో ఆస్పత్రి పాలయ్యారు. గుజరాత్ లోని బనస్కంత జిల్లాలోని అమిర్ గఢ్ తాలుగా కర్జా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్జా అనే గ్రామంలో సంగీత రణవాసియా(25), నిలేశ్ రనవాసియా అనే ఇద్దరు భార్యభర్తలు. వీరు దళితులు.

దర్బార్ అనే కమ్యూనిటికీ చెందిన అగ్రకులస్తులు తమ పొలంలో ఆవు చనిపోయిందని, దాని కళేబరాన్ని తీసి పారేసేందుకు రావాలని రనవాసియాను వారు అడిగారు. అయితే, ఇప్పుడు తాము ఆ పనిచేయడం లేదని బదులిచ్చారు. తాము చెప్పిన మాట వినవా అంటూ ఓ పదిమంది అతడిపై దాడి చేస్తుండగా ఐదునెలల గర్భవతి అయిన సంగీత అడ్డుపడబోయింది. దీంతో ఆమెపై కూడా చేయిచేసుకున్నారు. అడ్డొచ్చిన మరో ఆరుగురిపైనా దాడి చేశారు. దీంతో వారంతా ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చింది. దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dalit  cow  gujarat  pregnant dalit woman  brahmins  crime  

Other Articles