ఫైతాన్ తో సెల్ఫీ రాజా.. దూల తీరింది | Man narrowly escapes getting hurt while clicking selfie with Python

Man narrowly escapes getting hurt while clicking selfie with python

clicking selfie with Python, selfie with Python in Rajasthan's Mount Abu district, Python attack man while taking selfie, selfie with python

Man narrowly escapes getting hurt while clicking selfie with Python in Rajasthan's Mount Abu district.

ITEMVIDEOS:పైతాన్ తో సెల్ఫీ పరాచికాలా రాజా?

Posted: 09/23/2016 04:56 PM IST
Man narrowly escapes getting hurt while clicking selfie with python

మీకు సెల్ఫీల పిచ్చి ఉందా? వెరైటీగా దిగాలని ఆలోచిస్తుంటారా? ఎప్పుడైనా ఓ కొండచిలువతో ఆ ముచ్చట తీర్చుకున్నారా? పోనీ ఇప్పుడు తీర్చుకుంటారా? అయితే ఈ వీడియో చూశాక ఇంకోసారి ఆలోచించుకోండి.

రాజస్థాన్ లోని మౌంట్ అబూ పర్వత శ్రేణుల్లోని సిరోయ్ ప్రైవేట్ హోటల్లోకి నిన్న ఓ పైతాన్ ప్రవేశించింది. వెంటనే ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వాళ్లకి సమాచారం అందించడంతో వారొచ్చి దానిని పట్టేసుకున్నారు. ఇక ఊరంతా ఆ వార్త తెలిసి అక్కడకు చేరిపోయింది. అధికారులు దానిని సమీపంలోని అడవుల్లోకి వదిలేదామన్న ఉద్దేశంతో తీసుకెళ్తుండగా కొందరు యువకులు ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు.

 

అయితే ఓ యువకుడు మాత్రం కాస్త ముందుకెళ్లి దాంతో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించాడు. అతని సరదా చూసి కానివ్వమన్నట్లు ఆగిపోయారు. ఆ పాముకేమో ఫోటోలంటే ఆసక్తి లేనట్లు అంతే వెంటనే దూకి అతని భుజం అందుకునే ప్రయత్నం చేసింది. అదృష్టవశాత్తూ గాయలేమీ కాకుండానే అతగాడు బయటపడ్డాడు. సెల్ఫీల పిచ్చితో తిక్క చేష్టలకు దిగేవాళ్లకి ఇదో గుణపాఠంగా చెప్పుకోవచ్చు. అయినా కొండచిలువతో సెల్ఫీ ఏంటి రాజా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan  Python  selfie  attack  

Other Articles