జీఎస్టీతో ఏపీకి బొక్కేనంటున్న యనమల | Yanamala says AP to lose Rs 150 cr per year with GST.

Yanamala says ap to lose rs 150 cr per year with gst

AP to lose crores with GST, Andhra Pradesh GST, GST not help to AP, Yanamala on GST bill, Yanamala Shocking statement on GST bill, AP financial minister Yanamala, Yanamala ramakrishnudu

Yanamala says AP to lose Rs 150 cr per year with GST. But, Economists says nearly 4700 crores.

జీఎస్టీతో ఏపీకి లాస్ తప్పదన్న యనమల

Posted: 09/23/2016 04:27 PM IST
Yanamala says ap to lose rs 150 cr per year with gst

దేశం మొత్తం ఒకే పన్ను-ఒకే విధానం కోసం జీఎస్టీ(వస్తు సేవల పన్ను)ను ఆచరణలో పెట్టేందుకు అడ్డంకులన్నీ తొలగిపోవటమే కాదు, ఏకంగా జీఎస్టీ కౌన్సిల్ తొలిసమావేశం కూడా ఈరోజు ఢిల్లీలో ముగిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన గురువారం నుంచి జరిగుతున్న ఈ సమావేశానికి ప‌లు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, రెవెన్యూ అధికారుల‌ు హాజరయ్యారు కూడా. అయితే కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలతో ఏపీకి భారీగానే నష్టం ఉంటుందంటున్నారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఈ విషయాన్ని వెల్లడించారు. కౌన్సిల్ తీసుకున్న‌ నిర్ణ‌యం వల్ల ప్రభుత్వ ఖజానాకి ఏటా రూ.150 కోట్ల న‌ష్ణం వ‌స్తుంద‌ని వివరించారు. అయినప్పటికీ చిరువ్యాపారుల‌కు న‌ష్టం రాకూడ‌ద‌న్న ఉద్దేశంతోనే తాము కౌన్సిల్ తీసుకున్న నిర్ణ‌యానికి అంగీకారం తెలిపిన‌ట్లు పేర్కొన్నారు. మొద‌ట రూ.10 ల‌క్ష‌ల ట‌ర్నోవ‌ర్ పైబ‌డిన వారికి జీఎస్‌టీ వ‌ర్తింప‌జేయాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ, అంద‌రి అభిప్రాయాలు విన్న త‌రువాత దీనిని రూ.20 ల‌క్ష‌లుగా నిర్ణయించినట్టు ఆయ‌న తెలిపారు. అయితే ఆర్థికవేత్తలు చెబుతున్న వాదన మరోలా ఉంది. జీఎస్టీతో ఏపీకి భారీగానే నష్టం ఉంటుందని వారు చెబుతున్నారు. సుమారు సాలీనా 4700 కోట్లు నష్టం వాటిల్లే అవకాశం ఉందని లెక్కలుకట్టి మరీ చూపుతున్నారు. కేవలం బీజేపీ కోసమే టీడీపీ తొందరపడిందని, ముందు వెనకా చూడకుండా జీఎస్టీ కోసం హడావుడి సమావేశం ఏర్పాటు చేసి మరీ నిరసనల మధ్యే ఆమోదించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక వ‌చ్చేనెల 17, 18, 19వ తేదీల్లో రెండోసారి జీఎస్‌టీ కౌన్సిల్ స‌మావేశం జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు అరుణ్‌జైట్లీ వెల్లడించారు. ప‌న్నురేటు, శ్లాబ్‌ల‌పై రెండో స‌మావేశంలో తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అన్నారు. ఈ నెల 30న కూడా జీఎస్‌టీ కౌన్సిల్ స‌మావేశ‌మ‌వుతుంద‌ని చెప్పారు. బిల్లు వ‌ల్ల చిరువ్యాపారులకు ఎదుర‌య్యే ఇబ్బందులపై కూడా చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. రూ.20 ల‌క్ష‌ల ట‌ర్నోవర్‌లోపు ఉన్న‌వారికి జీఎస్‌టీ నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పారు. ఆపై టర్నోవ‌ర్ ఉన్న‌వారంద‌రికీ ఈ ట్యాక్స్ వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Financial Minister  Yanamala Ramakrishnudu  GST bill  

Other Articles