ఒక్క రూపాయి ఏం చేయగలవ్ అంటే.. ఛంతాడంత చేసింది..! tsrtc employees protest over suspension of conductor for one ruppee

Tsrtc employees protest over suspension of conductor for one ruppee

woman conductor transferred in uppal depot, uppal depot bandh, Uppal depo, apsrtc, lady conductor, suspension, one ruppee, transfer, Ratna kumari, bandh, rtc employees bandh, quarell with passenger

TSRTC Employees Has Staged Agitation in front of Uppal Bus Depot against The Transfer of a Woman Conductor named Ratna Kumari on the allegations of not giving one ruppee

ITEMVIDEOS: ఒక్క రూపాయి ఏం చేయగలవ్ అంటే.. ఛంతాడంత చేసింది..!

Posted: 09/12/2016 04:51 PM IST
Tsrtc employees protest over suspension of conductor for one ruppee

ఒక్క ఓటు ప్రభుత్వాన్ని మారుస్తుందని మనకు అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రభుత్వం పడిపోయినప్పుడు తెలిసింది. ఒక్క ఓటు గెలుపోటములను నిర్ధేశించగలదని తెలుసు. ఒక్క మార్కు విలువ ఉత్తీర్ణీత మార్కులను సాధించే ప్రతీ విద్యార్థికీ తెలుసు. ఒక్క మార్కుతో ఉద్యోగం అందని ద్రాక్షాగా మారిన నిరుద్యోగికీ దాని విలువ తెలుసు. కానీ ఒక్క రూపాయి విలువ ఎంతో తెలుసా..? ప్రస్తుతం రూపాయి విలువ ఎంతా అని అడుగుతున్నారు కూడానా..? గుడి దెగ్గరో.. లేక విధుల్లోనో తారపడిన యాచకులను చూసి.. ఆదే రూపాయిని ఇస్తే.. వద్దు బాబు మీదెగ్గరే వుండనీయండీ.. ఐదో పది ఇస్తే తీసుకుంటాం అంటున్నారు. అలా తయారైంది రూపాయి విలువ.

కానీ నిజంగా రూపాయిని కష్టపడి సంపాదించిన వారు మాత్రం తమదైన ఒక్క రూపాయిని కూడా వదులుకోలేరు. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ జరిగింది. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావని అడిగితే.. ఒకప్పుడు మాత్రం అన్నదమ్ముల మధ్య తగువు పెడతా అంటూ సినీ కవులు గేయాలు కూడా రచించారు. కానీ కండక్టరుకు, ప్రయాణికురాలికి మద్య చిచ్చు పెడతానని మాత్రం ఎవరైరా ఉహించగలరా..? యాజమాన్యానికి కార్మికులకు మధ్య అగాధాన్ని తయారు చేయగలదని, ఉద్యోగినికి విధులను దూరం చేయగలదని ఎవరూ ఊహించివుండరు. కానీ అచ్చంగా అలాంటిదే జరిగింది.

ప్రయాణికులకు, కండక్టర్‌కు ఒక్క రూపాయి చిల్లర విషయంలో జరిగిన వివాదంతో జంట నగరాల్లో దాదాపు సగం సిటీబస్సులు నిలిచిపోయాయి. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని డిపోల కార్మికులు సమ్మె చేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ కార్మిక వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఉప్పల్ డిపో పరిధిలో పనిచేసే రత్నకుమారి అనే కండక్టర్‌కు, ఒక ప్రయాణికురాలికి గొడవ జరిగింది. సదరు ప్రయాణికురాలికి ఒక రూపాయి చిల్లర ఇవ్వాల్సి ఉండగా, కండక్టర్ వద్ద చిల్లర లేదని.. దానిపై ఇద్దరికీ మాట మాట పెరగడంతో ప్రయాణికురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని అంటున్నారు.

దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు రత్నకుమారిని సస్పెండ్ చేశారని.. అందుకు నిరసనగా హైదరాబాద్ రీజియన్ పరిధిలోని పలు డిపోలకు చెందిన కార్మికులు సమ్మె చేస్తున్నారని కొందరు ఆర్టీసీ కార్మికులు చెప్పారు. ఉదయం నుంచి బస్సులు తక్కువగా తిరగడం, షేర్ ఆటోల మీదే ఆధారపడాల్సి రావడంతో అసలు ఏంజరిగిందో కూడా సామాన్య ప్రజలకు చాలాసేపటి వరకు తెలియలేదు. ఉన్నట్టుండి బస్సులు నిలిచిపోవడంతో ఉదయం కళాశాలలకు, కార్యాలయాలకు వెళ్లాల్సిన వారు చాలా ఇబ్బందులకు గురయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Uppal depo  apsrtc  lady conductor  suspension  one ruppee  transfer  Ratna kumari  bandh  rtc employees bandh  

Other Articles