హోటళ్లపై బాంబు దాడులు | Petrol bombs hurled at Chennai hotel and also revenge attack

Petrol bombs hurled at chennai hotel and also revenge attack

Cauvery water issue, Petrol bombs hurled at Chennai hotel, New Woodland Hotel attack, hotel attacks in Tamil Nadu and karnataka, Cauvery water dispute

Petrol bombs hurled at Chennai hotel and also revenge attack.

ITEMVIDEOS:నీళ్ల కోసం హోటళ్ల తుక్కురేగొడుతున్నారు

Posted: 09/12/2016 04:22 PM IST
Petrol bombs hurled at chennai hotel and also revenge attack

కావేరీ నీటి విడుదల విషయంలో ఇరు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తున్నాయి. సోమవారం ఉదయం కర్ణాటకలోని తమిళనాడుకు చెందిన హోటళ్లపై కొందరు గుర్తుతెలియని వ్యక్తలు దాడి చేయగా, ప్రతిగా తమిళ ప్రజలు తమ కోపాగ్నిని తీర్చుకునేందుకు హింస బాట పడుతున్నారు. చెన్నైలోని కన్నడిగుల ఆస్తులపై దాడులకు దిగారు. డాక్టర్ రాధాకృష్ణన్ సాలై ప్రాంతంలో ఓ కన్నడ వ్యాపారి నడుపుతున్న న్యూ ఉడ్ ల్యాండ్ హోటల్ పై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు బాంబులతో దాడి చేశారు.

మూడు ఆటోల్లో వచ్చిన దాదాపు 15 మంది హోటల్ అద్దాలను, ఐస్ క్రీం పార్లర్ ను, ఆఫీస్ రూంను ధ్వంసం చేశారు. పెట్రోలుతో సీసాలను నింపుకు వచ్చి వాటిని అంటించి విసిరేశారు. కర్ణాటకలో ఓ తమిళ యువకుడిని వీధుల్లో తీవ్రంగా కొట్టిన నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. కర్ణాటకకు, కన్నడిగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.హోటల్ గోడలపై "కర్ణాటకలో తమిళులపై దాడులు చేస్తే, తమిళనాడులో కన్నడవాసుల ప్రాంతాలపై మేమూ దాడులు చేస్తాం. ఇక్కడ కన్నడ ప్రజలు ఉన్నారు. జాగ్రత్త" అని రాసి నిరసనకారులు వెళ్లిపోయారు.

ఈ ఘటనకు తామే బాధ్యులమని ఎవరూ ప్రకటించుకోనప్పటికీ, టీపీడీకే (తాన్ తాయ్ పెరియార్ డ్రావిడర్ కళగం) కార్యకర్తలు ఇందుకు బాధ్యులని, వీరంతా రాయపేట నుంచి వచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీరు వచ్చిన ఆటోలు ప్రయాణించిన మార్గంలో సీసీటీవీ ఫుటేజ్ లు పరిశీలిస్తున్నామని, నిందితులను గుర్తించే ప్రయత్నం జరుగుతోందని రాష్ట్ర డీజీపీ టీకే రాజేంద్రన్ తెలిపారు.

దీనికి ప్రతీకారంగా కర్ణాటకలోని మైసూరు రోడ్డులో ఉన్న అడయార్ ఆనంద భవన్ పై పదుల సంఖ్యలో నిరసనకారులు దాడులు చేశారు. హోటల్ ను ధ్వంసం చేశారు. అక్కడి అద్దాలను పగులకొట్టి, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. వెంటనే స్పందించిన ర్యాపిడ్ యాక్షన్ బలగాలు అక్కడికి వచ్చి లాఠీచార్జ్ చేసిన తరువాతనే పరిస్థితిని అదుపులోకి వచ్చింది.

 

మేం చెప్పినట్టు వినాలి: సుప్రీం కోర్టు

తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తమ రాష్ట్రం ఇబ్బందుల్లో పడిందని, తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ కర్ణాటక సర్కారు దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దేశ ప్రజలు కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని, తమిళులైనా, కన్నడిగులైనా తామంతట తాము చట్టంగా వ్యవహరించరాదని వ్యాఖ్యానించింది. రెండు రాష్ట్రాలూ చట్టాన్ని గౌరవించాలని, తాము ఎన్నో ఆలోచించే ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది.

సుప్రీంకోర్టు చెబితే వినాలంటూ.. నిరసనలకు దిగుతూ సాధారణ ప్రజా జీవనాన్ని ఇబ్బందులు పెడుతున్నవారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. అధికారులు కల్పించుకుని శాంతిభద్రతలు కాపాడాలని, అందుకు ప్రభుత్వం కూడా సహకరించాలని కోరింది. ఈ నెల 5న ఇచ్చిన తీర్పును సవరిస్తూ, 15 వేల క్యూసెక్కులకు బదులుగా 12 వేల క్యూసెక్కుల చొప్పున ఈ నెల 20 వరకూ తమిళనాడుకు నీటిని వదలాల్సిందేనని కర్ణాటకకు ఆదేశాలిస్తూ, కావేరీ జలాల వివాదంపై తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamilnadu  Karnataka  Hotels  destroy  Cauvery  Water  

Other Articles