అందాలను వీక్షించేందుకు ఒక్కసారి రారూ.. మెగాస్టార్ సారూ.. Dalits to invite Amitabh Bachchan, PM Modi to feel 'Badbu Gujarat Ki'

Dalits to invite amitabh bachchan pm modi to feel badbu gujarat ki

amitabh bachchan, modi, narendra modi, dalit, dalits gujarat, dalit discrimination, una flogging, dalit atrocities, dalit minority, dalit violence, dalit protests, dalit community, gujarat, national news

Una Dalit Atyachar Ladat Samiti will launch the campaign from Kalol, when thousands of postcards bearing the tagline 'Badbu Gujarat Ki' will be mailed to Bachchan and PM Modi inviting them to the state.

అందాలను వీక్షించేందుకు ఒక్కసారి రారూ.. మెగాస్టార్ సారూ..

Posted: 09/11/2016 11:29 AM IST
Dalits to invite amitabh bachchan pm modi to feel badbu gujarat ki

యావత్ దేశాన్ని స్వచ్చా భారత్ నినాదంలో దుర్గంధ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలపై పన్ను భారం మోపీ మరీ చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదని ఏకంగా ఉద్యమానికే పూనుకుంటున్నారు అక్కడి ప్రజలు. దేశం సంగతి కాదు కానీ ముందుగా తమ రాష్ట్రంలో దుర్ఘంధపూరిత అందాలను ఓక్కసారి వచ్చి చూడండీ మెగాస్టారు సారూ అని కోరుతూ బాలీవుడ్ అగ్రనటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు ప్రధాని నరేంద్రమోడీకి కూడా లేఖలు రాస్తున్నారు. ఇంతకీ వీళ్లు ఏ రాష్ట్ర వాసులు అంటారా..? ఇంకెవరండీ స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ కు చెందిన దళితులు.

 ఎలా వుందో ఒకోసార  పూరితంగా తయారైన గుజరాత్‌ను సందర్శించేందుకు రావాలంటూ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను ఆహ్వానించేందుకు ఉనా దళిత్ అత్యాచార్ లాదత్ సమితి(యూడీఏఎల్ఎస్) ఆధ్వర్యంలో దళితులు సిద్ధమయ్యారు. ‘‘కుష్‌బూ గుజరాత్ కి’’, కుచ్ దిన్ తో గుజారియే గుజరాత్ మే’’ అనే ట్యాగ్ లైన్స్‌తో ఆ రాష్ట్ర పర్యాటక శాఖను ప్రమోట్ చేస్తున్న బిగ్‌బీని రాష్ట్రంలోని అసలు దుస్థితిని చూడాల్సిందిగా వేలాది పోస్టు కార్డులు రాసేందుకు ఉద్యుక్తులవుతున్నారు.

ఈనెల 13న నిర్వహించనున్న బహిరంగ సభ అనంతరం వేలాదిమంది దళితులు అమితా బచ్చన్‌ను గుజరాత్‌కు ఆహ్వానిస్తూ లేఖలు రాయనున్నట్టు యూడీఏఎస్ఎస్ కన్వీనర్ జిగ్నేష్ మేవాని పేర్కొన్నారు. ‘‘ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు బచ్చన్ అందమైన గుజరాత్ అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పుడు దళితులను జంతు కళేబరాలను తొలగించేందుకు అడ్డుకుంటుండడంతో రాష్ట్రం కంపుకొడుతోంది. ఆయన(బచ్చన్) ఇక్కడికి వచ్చి కొంతకాలం ఇక్కడ ఉండి గుజరాత్ దుర్గంధాన్ని చూడాలి’’ అని మేవాని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles