ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ రాజీనామా తిరస్కరణ.. AAP Refuses To Accept Amanatullah Khan's Resignation

Aap refuses to accept amanatullah khan s resignation

amanatullah khan, aap mla amanatullah khan, aap amanatullah khan, aap jamia nahar mla, india news, aap news, aam aadmi party mla

Aam Aadmi Party refused to accept the resignation of its legislator Amanatullah Khan, against whom an FIR was registered a day ago following molestation charges levelled by a relative.

ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ రాజీనామా తిరస్కరణ..

Posted: 09/11/2016 10:57 AM IST
Aap refuses to accept amanatullah khan s resignation

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు పార్టీ మద్దతు లభించింది. ఆయన అమ్ ఆద్మీ పార్టీ కల్పించిన అన్ని పదవులతో పాటు శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ సమర్పించిన లేఖను అప్ అధిష్టానం తిరస్కరించింది. ఆయనపై జామియా నగర్ పోలీసు స్టేషన్లో లైంగిక దాడి కేసు నమోదైన నేపథ్యంలో తన పదవులకు ఖాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదు ఇచ్చింది కూడా ఎవరో కాదు.. సాక్షాత్తు ఖాన్ బావమరిది భార్యే!! గత నాలుగేళ్లుగా అమానతుల్లా తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు.

దీంతో అమానతుల్లాతో పాటు ఆయన బావమరిదిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తనతో సంబంధం పెట్టుకోవాల్సిందిగా ఆమానతుల్లా ఒత్తిడి చేసేవారని, తన అత్తమామలు వరకట్నం కోసం తరచు చిత్రహింసలు పెట్టేవారని కూడా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త సైతం.. అమానతుల్లాతో వివాహేతర సంబంధం పెట్టుకోవాల్సిందిగా ఒత్తిడి చేసేవాడని తెలిపారు. ఆమె చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసుతో నేపథ్యంలో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ అమానతుల్లా ఖాన్ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు లేఖ ఇచ్చిన కొద్ది సేపటి తర్వాతే ఈ ఫిర్యాదు విషయం వెలుగులోకి వచ్చింది. తనపై వస్తున్న వివిధ ఆరోపణలకు వివరణలు ఇచ్చుకోలేక తాను అలసిపోయానని ఖాన్ అన్నారు. తాను ఎన్నికైన రోజు నుంచి ఢిల్లీ ప్రజలకు సంపూర్ణ నిబద్ధతతో సేవలు చేశానని తెలిపారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా నియమితుడినైన వెంటనే పాత ప్రభుత్వంలో జరిగిన అనేక అవినీతి విషయాలను వెలుగులోకి తెచ్చానని, కానీ తన నిజాయితీ కొందరికి నచ్చలేదని అన్నారు. అందుకే తనపైన, తన కుటుంబ సభ్యులపైన తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amanatullah khan  aap mla  Aam Aadmi Party  molestation  resignation  

Other Articles