UN virtually confirms six addresses of Dawood Ibrahim in Pakistan

Six addresses of dawood in pak get indirect un confirmation

dawood ibrahim, dawood ibrahim address, dawood ibrahim in pakistan, pakistan dawood ibrahim, dawood ibrahim in pakistan, karachi, indian most wanted criminal

India, in a dossier, had cited nine addresses in Pakistan as those frequented by Dawood of which the UN Security Council's ISIL and Al-Qaida Sanctions Committee has removed three, finding those incorrect

బట్టభయలైన పాకిస్థాన్ బొంకు.. నిగ్గు తేల్చిన ఐక్యరాజ్యసమితి

Posted: 08/24/2016 06:05 AM IST
Six addresses of dawood in pak get indirect un confirmation

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే తలదాచుకుంటున్నట్లు నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక బృందం నిగ్గు తేల్చిన వాస్తవమిది. పాకిస్థాన్‌లోని ఆరు ప్రాంతాల్లో దావూద్‌కు ఇళ్లు ఉన్నాయని ఐక్యరాజ్యసమితి బృందం నిర్థారించింది. ఈమేరకు దావూద్ నివాసాలకు సంబంధించి భారత్‌ సమర్పించిన 9 చిరునామాల్లో 6 సరైనవేనని ఐరాస ప్రత్యేక బృందం తేల్చింది. మూడు చిరునామాలు మాత్రం తప్పని పేర్కొంది.

యూఎన్ఓ వ్యాఖ్యలతో దావూద్‌కు పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తూ వస్తోందని భారత్ చేస్తున్న వాదనలకు మరింత బలం చేకూరినట్లైంది. పాకిస్థాన్‌లో దావూద్ నివాసాలకు సంబంధించి భారత నిఘా సంస్థలు కచ్చితమైన ఆధారాలు సంపాదించాయి. ఆ సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పాకిస్థాన్ విదేశాంగ కార్య దర్శి  సర్తాజ్ అజీజ్‌కు అందచేశారు. అలాగే ఐక్యరాజ్యసమితి ప్రత్యేక బృందానికి కూడా ఆ సమాచారాన్ని చేరవేశారు. భారత్ అందించిన ఆధారాలను ప్రత్యేక బృందం నిశితంగా పరిశీలించింది. అనంతరం దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని నిర్దారించింది.

కాగా 1993లో ముంబై పేలుళ్లకు దావూద్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో అతడు భారత్ నుంచి పరారయ్యాడు. ముంబై నుంచి మకాం ఎత్తేసి విదేశాలకు పారిపోయాడు. కొన్నాళ్లు దుబాయ్‌లో తలదాచుకున్నాడని, తర్వాత పాకిస్థాన్‌లోని కరాచీలో నివాసం ఏర్పరచుకున్నాడని, పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐ అతడికి సహకరిస్తోందని వార్తలు వచ్చాయి. ఆ కథనాలు వెలువడిన వెంటనే దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అతడి అప్పగింత కోసం పాకిస్థాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భారత హోంశాఖ ప్రకటించింది. అయితే, పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం అతడు తమ దేశంలో లేనే లేడంటూ ఆ వార్తలను ఖండించిన విషయం తెలిసిందే.

మరోవైపు దావూద్ ఇబ్రహీం భారత్‌కు మాత్రమే కాదు, అంతర్జాతీయ భద్రతా సంస్థలకు కూడా ‘బాగా కావాల్సిన’ (మోస్ట్ వాంటెడ్) నేరగాడు. ముంబైలో 1993లో జరిగిన పేలుళ్లకు ఆర్థిక సహకారం అందించడమే కాకుండా, పేలుళ్ల కుట్రలో కీలక పాత్ర పోషించినందుకు ఇతడిపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 2008లో జరిగిన ముంబై పేలుళ్లు సహా పలు ఉగ్రవాద చర్యల్లో దావూద్ పాత్ర ఉన్నట్లు భారత్, రష్యా ఇంటెలిజెన్స్ సంస్థలు ఆధారాలు సేకరించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dawood Ibrahim  pakistan  underworld don dawood  united nations  

Other Articles