Saath Nibhana Saathiya actor Pratibha Tiwari files FIR against molester

Saath nibhaana saathiya actress pratibha tiwari molested files fir

pratibha tiwari, saath nibhana saathiya actress molested, naiya molested, actress molested, saath nibhana saathiya, tv actress molested, saath nibhana saathiya news, saath nibhana saathiya cast, tv news

Pratibha Tiwari, best known as Naiya of Saath Nibhana Saathiya, was molested by a drunk man in Mumbai. The gutsy actress fought back and dragged the man to a police station.

నడిరోడ్డుపై నటిని వేధించిన తాగుబోతు..

Posted: 08/24/2016 06:16 AM IST
Saath nibhaana saathiya actress pratibha tiwari molested files fir

దేశ రాజధానితో పాటు పోటీ పడుతున్న అర్థిక రాజధాని ముంబై అభివృద్ధితో పాటు అటు నేరాలలోనూ పోటీ పడుతున్నట్లు వుంది. ముంబైలో మహిళలు సురక్షితంగా తిరగవచ్చంటూ గత కొన్ని నెలల క్రితం ఓ సంస్థ ప్రకటించగా, ఈ ఘటన మాత్రం పూర్తిగా అందుకు భిన్నంగా వుంది. ప్రముఖ టీవీ సీరియల్ నటి ప్రతిభా తివారిని నడిరోడ్డుమీద ఓ తాగుబోతు వేధించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ముంబైలో ఇటీవల ఈ ఘటన జరిగింది. 'సాథ్ నిభానా సాథియా' వంటి పలు హిందీ సీరియళ్లతో ప్రతిభా తివారీ గుర్తింపు తెచ్చుకుంది

ఇటీవల కందివాలి హైవేపై రాత్రి పది గంటల సమయంలో ఆమె, తన హెయిర్ డ్రెస్సర్ తో కలిసి ఎదురుచూస్తోంది. ఈ సమయంలో ఓ తాగుబోతు వారిని సమీపించి, అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి సతాయింపులతో విసిగిపోయిన ప్రతిభా తివారీ..  ఆ ఆకతాయిని సమీపంలోని పోలీసు స్టేషన్ కు ఈడ్చుకెళ్లి అప్పగించింది. అతడిపై ఫిర్యాదు చేసింది. తాగిన మత్తులో ఆమెను వేధించిన వ్యక్తి కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని తెలిసింది.

ఈ ఘటన గురించి తాజాగా మీడియాతో మాట్లాడిన ప్రతిభా తివారీ మహిళలు ఇలాంటి ఆకతాయిలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించింది. 'రద్దీగా ఉన్న రోడ్డుపై రాత్రి 10 గంటల సమయంలో ఇలాంటి ఘటన జరగడం నన్ను విస్మయ పరిచింది. ఇది నన్ను షాక్ కు గురిచేయడమే కాదు వాస్తవ పరిస్థితి ఏమిటో తెలియజేసింది. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు చేయడానికి మహిళలు భయపడతారని నాకు తెలిసింది. కానీ ఇలాంటివాటిపై వారు పోరాడాల్సిన అవసరముంది' అని ఆమె పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles