Another poll shows Clinton opening up lead over Trump

Clinton keeps that bounce as new poll has her up 8

Hillary Clinton, Elections, Polls, Democratic National Convention, Donald Trump, Republican National Convention, 2016 Elections, Republican National Convention 2016, Democratic National Convention 2016, Hillary Clinton 2016, Donald Trump 2016

CNN/ORC International survey conducted Friday-Sunday, shows Clinton leading Trump by 9 points, 52 percent to 43 percent.

అగ్రరాజ్య అధ్యక్ష రేసులో దూసుకెళ్తున్న హిల్లరీ..

Posted: 08/03/2016 01:47 PM IST
Clinton keeps that bounce as new poll has her up 8

అమెరికా ఎన్నికల ప్రచారంలో డెమొక్రటిక్ అభ్యర్థిని హిల్లరి క్లింటన్ ను దెయ్యంగా అభివర్ణించిన రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఈసారి ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుండొచ్చని ఆరోపించడం లాంటి చర్యలతో ఇప్పటి వరకు అధ్యక్ష రేసులో దూసుకుపోయిన ట్రంప్ ఏకంగా తన గెలుపు అవకాశాలు తగ్గించుకున్నారు. ఓహియోలోని కొలంబస్ వద్ద ఆయన మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందేమోనని తనకు భయంగా ఉందని, అయినా తాను మాత్రం నిజాయితీగానే ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన గెలుపు అవకాశాలు అమాంతంగా సన్నగిల్లాయి.

తాజా సర్వేల ప్రకారం హిల్లరీ క్లింటన్.. డోనాల్డ్ ట్రంప్ను అమాంతం వెనక్కి నెట్టేశారు. తొమ్మిది శాతం పాయింట్లతో ఆమె ముందు వరుసలో ఒక్కసారిగా దూసుకెళ్లారు. డెమొక్రటిక్ పార్టీ జాతీయ సదస్సు నిర్వహించిన అనంతరం హిల్లరీ ఈ స్థాయిలో ముందుకెళ్లడంతో ఆ పార్టీలో ఓ రకంగా సంబురాలు మొదలైనట్లయింది. సీఎన్ఎన్/ఓఆర్ సీ నిర్వహించిన జాతీయ సర్వేలో ఆమె స్వతంత్రులు సహా సాండర్స్ వైపు ఉన్నవారి మద్దతుకూడా అమాంతం పొంది తొమ్మిది శాతం ట్రంప్ కన్నా అదనపు పాయింట్లు దక్కించుకున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.

ఈ సర్వే అనంతరం అంతకుముందు 52శాతం పాయింట్లతో ముందున్న ట్రంప్ తొమ్మిది పాయింట్లు తగ్గిపోయి 43శాతం పాయింట్లతో కిందికి దిగిపోగా హిల్లరీ 58శాతం పాయింట్లతో ముందుకొచ్చింది. గత మే నెల నుంచి హిల్లరీకి ఇంతపెద్ద మొత్తంలో మద్దతు పెరగడం కూడా ఇదే తొలిసారి. సదస్సు నిర్వహించిన అనంతరం హిల్లరీ మొత్తం మహిళా లోకంతోపాటు శ్వేతజాతీయేతరులు, స్వతంత్రుల అభ్యర్థుల మద్దతు కూడా హిల్లరీకి లభించినట్లు సర్వే వెల్లడించింది. అంతేకాదు, ఆమెపై నమ్మకం పెంచుకున్నవారు 34శాతానికి పెరిగారని కూడా సర్వే తెలిపింది. అంతేకాదు, గతంలో హిల్లరీకి శాండర్స్ మద్దతుదారులు 78శాతం ఉండగా ఈ సదస్సు అనంతరం వారు 91శాతానికి పెరిగినట్లు పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hillary clinton  donald trumph  US presidential elections  

Other Articles