యూపీలో టీచర్ పై గ్యాంగ్ రేప్ | Another gang rape in UP

Bareilly teacher gang rape in delhi lucknow highway

Bulandshahr rape incident, school teacher gang rape, bareilly gang rape, serial gang rapes in UP, gang rape filmed, teacher rape filmed, rape filmed in India

A schoolteacher was gang- raped in Uttar Pradesh's Bareilly.

యూపీలో మరో దారుణం.. టీచర్ పై గ్యాంగ్ రేప్

Posted: 08/03/2016 02:52 PM IST
Bareilly teacher gang rape in delhi lucknow highway

బులంద్ షహార్ తల్లి కూతుళ్ల గ్యాంగ్ రేప్ ఉదంతం మరవక ముందే మరో హైవే అత్యాచారం వెలుగు చూసింది. 19 ఏళ్ల ఓ టీచర్ ను తుపాకీతో బెదిరించి మరీ సామూహిక అత్యాచారం చేసిన ఘటన యూపీలోనే చోటుచేసుకుంది

బరేలీకి చెందిన యువతి రోజులాగే మంగళవారం కూడా స్కూల్ కు బయలుదేరింది. దారిలో అటకాయించిన ఇద్దరు దుండగలు గన్ తో బెదిరించి బలవంతంగా ఆమెను కారులోకి లాగారు. ఆపై ఢిల్లీ-లక్నో హైవేకి తీసుకెళ్లి కదులుతున్న కారులోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తతంగం అంతా వారి సెల్ ఫోన్లలో బంధించారు కూడా. విషయం ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో దానిని అప్ లోడ్ చేస్తామని బెదిరించి రోడ్డుపక్కన ఆమెను పడేసి వెళ్లారు. స్థానికుల సాయంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

వారు ముసుగులు ధరించి ఉన్నారని, వేడుకున్నా వదల్లేదని ఆ యువతి చెబుతోంది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్వాడ్ తో ఆ ప్రాంతంలో తనిఖీలు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఓ పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు. కాగా, ఉత్తరప్రదేశ్ అత్యాచారాలకు నెలవుగా మారిందని విపక్షాలు అఖిలేష్ సర్కార్ పై దుమ్మెత్తి పోస్తున్నాయి. గత నాలుగు నెలల్లోనే అక్కడ 357 అత్యాచార కేసులు నమోదు కావటం తీవ్రతకు అద్దం పడుతోందని వారు విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bulandshahr  UP  bareilly  teacher  gang rape  filmed  

Other Articles