Hillary's legacy is 'death, destruction and weakness': Donald Trump

Criticizing clinton trump vows to defeat the barbarians of isis

500 Islamic State suspects, democrat, Donald Trump, Hillary Clinton, islamic-state, Middle East, Obama, Republican, Republican National Convention, Syria

Donald Trump targeted Hillary Clinton for leaving behind a legacy of "death, destruction and weakness" as former US secretary of state and blamed her "bad judgement" for disasters unfolding across the world.

ఐఎస్ ఉగ్రవాద అవిర్భావం, విస్తరణకు కారణం అమె..!

Posted: 07/23/2016 08:27 AM IST
Criticizing clinton trump vows to defeat the barbarians of isis

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అవిర్భవించడానికి, విస్తరించడానికి కారణం ఎవరని అనుకుంటుంన్నారు. అమెరికా అధ్యక్ష బరిలోఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌.. ఉద్దేశ్యంలో మాత్రం ఈ ఉగ్రవాద సంస్థ అవిర్భవించి, విస్తరించడానికి కారణం మాత్రం తన డెమోక్రాటిక్‌ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌. ఈ విషయమై ఆయన అమెపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమెను ఎన్నుకుంటే అమెరికన్లకు చావే గతి అని అన్నారు. పార్టీ అభ్యర్థిత్వం స్వీకరించాక పార్టీ జాతీయ కన్వెన్షన్‌లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా హిల్లరీ, ఒబామా విధానాలను ట్రంప్ తూర్పారబట్టారు.

ఒబామా ఆమెను విదేశాంగ మంత్రిగా ప్రకటించకముందు అమెరికా ఎంతో కొంత సురక్షితంగా ఉందని. అయితే అమె విదేశాంగ శాఖ మంత్రిగా తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా ఇప్పుడు ఉగ్రవాదం, వినాశనం రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. అయితే ఈ మాటలు అంటున్నది తాను కాదని, డెమొక్రటిక్ పార్టీకి చెందిన పార్టీ నేత బెర్నీ శాండర్సే అమెపై ఇలాంటి విమర్శలతో విరుచుకుపడ్డారని గుర్తుచేశారు. 2009లో ఐఎస్‌ అనేది పుట్టనేలేదని. ఆమె విదేశాంగ మంత్రిగా ఉన్న నాలుగేళ్లలో పశ్చిమాసియాకు.. తర్వాత ప్రపంచమంతా విస్తరించిందని విమర్శించారు.

ప్రస్తుతం లిబియా తగలబడిపోతోందని. అమెరికా రాయబారి, మన ఎంబీసీ సిబ్బంది ఉగ్రవాదుల తూటాలకు బలైపోయారు. భయంకరమైన శరణార్థి సమస్య తలెత్తి ఐరోపా, అమెరికాలను వణికిస్తోంది. ఇదీ ఆమె రికార్డు’ అని మండిపడ్డారు. కాగా.. ట్రంప్‌ గెలుపు కోసం నిధులు సమీకరించడానికి భారతీయ అమెరికన్‌ శలభ్‌ షాలీ కుమార్‌ సెప్టెంబర్‌లో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ‘రిపబ్లికన్‌ హిందూ సంకీర్ణం’ వ్యవస్థాపకుడైన ఆయన.. తన కుటుంబం తరపున ఇప్పటికే రూ.7.37 కోట్లు విరాళమిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  Hillary Clinton  islamic-state  Middle East  Obama  

Other Articles