పార్లమెంట్ లో కబాలి ఎవరంటే... | Kabali of Congress KVP in Parliament

Kabali o congress kvp in parliament

KVP Kabali for Congress, Congress Kabali, Kabali in Parliament, KVP AP special status bill, Private bill KVP, AP congress hero KVP

KVP kabali for congress in parliament through AP special status bill

పార్లమెంట్ లో కబాలి ఎవరంటే...

Posted: 07/23/2016 10:05 AM IST
Kabali o congress kvp in parliament

కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ ను ఉన్నపళంగా ఏపీ ప్రజల దృష్టిలో హీరోను చేసేద్దామనుకున్నారు ఆ పార్టీ సినీయర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు. ప్రైవేట్ బిల్లు ద్వారా విజయాలు సాధించిన చరిత్ర ఎక్కడా లేకపోయినా పార్టీల మద్ధతును కూడగట్టుకుని ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో గళం విప్పేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. అయితే ఈ ప్రయత్నం పూర్తి మేరకు విజయవంతం కాలేకపోయింది. నిరసనలతో సోమవారానికి రాజ్యసభను విజయవంతంగా వాయిదా వేయించగలిగింది అధికార బీజేపీ.

అయితే పార్లమెంటులో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచిన కేవీపీ గురించే ఇప్పుడు చర్చించుకుంటున్నారు జాతీయ స్థాయి నేతలు. పార్లమెంటు ముందుకు పెద్ద సంఖ్యలో ప్రైవేటు బిల్లులు వస్తున్నా కేవీపీ ప్రవేశపెట్టిన ‘హోదా’ బిల్లు నిజంగా ప్రత్యేకమైనదే. దాదాపు వారం రోజులుగా కేవీపీ బిల్లుపై దేశవ్యాప్తంగా అన్ని మీడియా సంస్థల్లో పెద్ద ఎత్తున వార్తా కథనాలు వచ్చాయి. ఒక్క బిల్లుతో ఈ స్థాయిలో దుమారం లేపవచ్చని కేవీపీ నిరూపించారంటూ పలువురు ఎంపీలు ఆయన్ను ప్రశసంల్లో ముంచెత్తారు. పతనం స్థాయికి చేరిన పార్టీని పైకి లేపుతూ హీరోగా మారిపోయారంటూ సొంత నేతలు కితాబిచ్చారు.

ఈ నేపథ్యంలో బిల్లు పై చర్చ జరిగిన సమయంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలి’ విడుదలైన సంగతి తెలిసిందే. అదే సమయంలో రాజ్యసభలో జరిగిన నాటకీయ పరిణామాల మధ్య బిల్లుపై ఓటింగ్ వాయిదా పడిపోయింది. అయినప్పటికీ ‘‘ఈ రోజుకు ‘కబాలి’ మీరే’’ అంటూ వీపీతో కొందరు అగ్రనేతలు సరదా వ్యాఖ్యలు చేయటం విశేషం. మరి ఆయన చేస్తున్న కృషి ఫలితం కబాలిలా కాకుడదని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KVP ramchandra rao  AP special status  Private bill  Rajya Sabha  Congress  

Other Articles