When I ate everything: 'Chubby' Virat Kohli is giving us the feels with this

Can you identify this kid who s now a fitness idol in cricketing world

India Cricket Team, Virat Kohli, Cricket, latest Cricket news

Virat Kohli is arguably the fittest cricketer in the world currently. But the story was quite different during the Indian Test captain's childhood days

ఈ చిన్నారి క్రికెటర్ ఎవరో గుర్తించగలరా.?

Posted: 07/21/2016 06:34 PM IST
Can you identify this kid who s now a fitness idol in cricketing world

తన ముందు ఏమున్నా ఎంచక్కా లాగించేస్తా అన్నట్లుగా ఫోటోకు ఫోజిచ్చిన ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? కొద్దిగా కష్టమే. అయితే ఈ ఓ క్రికెటర్. అందులోనూ భారతీయ క్రికెటర్. ఇప్పుడు కూడా కష్టమంటారా..? అయితే ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఈయన ఓ ఫిట్ నెస్ ఐడల్ గా మారిపోయాడు. ఇప్పుడు గుర్తుపట్టారా.?? అవును కరెక్టే.. ఈ బూరబగ్గుల బుల్లోడు మరెవర కాదు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. అటు క్రికెటర్గా, ఇటు టెస్టు కెప్టెన్గా క్రికెట్లో తనదైన ముద్ర వేస్తన్నాడు ఈ యువ సంచలనం.

ఆనాటి బాల్యపు జ్ఞాపకాలను నెమరవేసుకున్న కోహ్లి.. అందుకు సంబంధించి ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఆటలోనే కాదు.. సోషల్ మీడియా పోస్టింగ్లలో కూడా కోహ్లి ముందుంటాడు. ఇటీవల వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివ్ రిచర్డ్స్తో దిగిన ఫోటోను పోస్ట్ చేసిన కోహ్లి.. తాజాగా  చిన్నప్పుడు ముద్దుగా, బుద్ధిగా కూర్చొని బర్గర్లు తింటున్న ఫోటోను అభిమానులకు షేర్ చేశాడు. ఇలా బర్గర్లు తినడం వల్లే బొద్దుగా తయారయ్యానంటూ కోహ్లి సరదాగా చమత్కరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India Cricket Team  Virat Kohli  Cricket  latest Cricket news  

Other Articles