Know more about under sea Shiva temple in Gujarat

The unique temple of lord shiva under the sea

Lord Shiva Temple in the Sea, nishkalank temple in sea, shiva temple in sea, shiva temple under sea, Nishkalank Mahadev Temple, Koliyak, Bhavnagar, Gujarat, Temple wonders, Temple awe, temple inside the sea, gujarat news, india news, national news, latest news

Nishkalank Mahadev Temple in Koliyak, Bhavnagar, Gujarat is full of wonders and awe. This temple is buried inside the sea.

ITEMVIDEOS: మహాదేవుని దర్శించే భక్తుల కోసం.. సముద్రుడే తరలివెళ్తాడు..

Posted: 07/21/2016 07:10 PM IST
The unique temple of lord shiva under the sea

దేశంలో ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత, విశిష్టత ఉంది. ఎన్నో మహిమలకు నిలయాలు మన దేవాలయాలు. ఇక స్వయంబు దేవాళయ విషయానికి వస్తే.. అశ్చర్యగోలిపే వింతలు, విడ్డూరాలు దర్శనమిస్తాయి. అలాంటి స్వయంబు అలయమే ఈ నిష్కళంక మహాదేవ అలయం. ఈ ఆలయానికి పటిష్టమైన ప్రహరీ గోడ, లేదా మూలవిరాట్టు చుట్టూ గోడలు, కనీసం గోపురం లాంటికి లేవు. కానీ విచిత్రమైన విషయమేమంటే.. ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల కోసం ఏకంగా సముద్రుడు దూరంగా కదలివెళ్తాడు. రాత్రి సమయంలో మళ్లీ యధాస్థానానికి తిరగివస్తాడు. ఏంటీ అలయాన్ని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఏకంగా సముద్రుడే కదిలివెళ్లిపోయి రాత్రికి తిరిగి వస్తాడా..? అంటూ అశ్చర్యపోకండి. ఇది నిజంగా నిజం.

గుజరాత్ లోని భావ్ నగర్ నగరానికి సమీపాన ఉన్న కొలియాక్ అనే గ్రామంలో సముద్రం నుండి 1. 5 కిలోమీటర్ల లోపల ఉన్నది. ఈ గ్రామం నుంచి కిలోమీటర్‌ దూరంలో ఉన్న అరేబియా సముద్రంలో పరమేశ్వరుని దేవాలయం ఉంది. దాని ప్రత్యేకత ఏమిటంటారా? పొద్దున్నే మనం అక్కడికి వెళ్ళామనుకోండి, అప్పటికి అక్కడ గుడి కనిపించదు. అక్కడ ఆలయం ఉందనడానికి సూచికగా ఓ ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుం టుంది. తరువాత మెల్లిగా మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సముద్రం వెనక్కి వెళ్తూ ఉంటుంది. దాంతో ఆలయం పూర్తిగా కనిపిస్తూ వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది. ఇక భక్తులు అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి పూజలు చేస్తారు.

ఇలా రాత్రి పదిగంటల వరకూ మీరు అక్కడే కాలం గడపొచ్చు. ఇక ఆ సమయం దాటితే మాత్రం అక్కడి నుంచి వెనక్కి వచ్చేయాల్సిందే! ఎందుకంటే మళ్ళీ సముద్రం ముందుకు వచ్చి ఆలయాన్ని నీటముంచుతుంది. దాంతో అది మర్నాడు మధ్యాహ్నం వరకు కనిపించదన్నమాట! అదీ అక్కడి విశేషం. ధ్వజస్తంభం ఎత్తు దాదాపు 20 మీటర్లు. అంటే దాదాపు ఆ ఎత్తువరకు నీళ్లు వచ్చేస్తాయి. కొన్ని వందల ఏళ్ళుగా ఇక్కడ ఇలాగే జరుగుతోందట. ఈ పరమేశ్వర ఆలయాన్ని పాండవులు నిర్మించారన్నది స్థలపురాణ గాథ! పౌర్ణమి రాత్రి పోటు సమయంలో పదిగంటల వేళ సముద్రం బాగా ముందుకు వచ్చేయడం, మెల్లిగా ఆలయాన్ని తనలో గర్భంలో దాచేసుకునే దృశ్యం అక్కడి యాత్రికులకు ఎంతో కనువిందు చేస్తుంది. మరి అలస్యమెందుకు వీళ్లుంటే మీరు ఈ పరమ పవిత్రమైన ఫుణ్యక్షేత్రాన్ని ఓ సారి దర్శించుకోరూ..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nishkalank Mahadev Temple  Koliyak  Bhavnagar  Gujarat  Temple wonders  Temple awe  

Other Articles