BJP ministers facing cases too must step down: Karnataka CM Siddaramaiah

Siddaramaiah attacks bjp over georg s resignation rules out cbi probe

Karnataka,KJ George,MK Ganapathy,Police Officer Suicide, Siddaramaiah, Karnataka CM, Smriti Irani, Bandaru Dattatreya, KG George, poltics, cbi probe, karnataka news

The ruling Congress in Karnataka has found itself on the defensive over allegations of harassment of a police officer that led to the resignation of minister K J George responded with attacks.

మాజీ మంత్రి జార్జిను వెనకేసుకోచ్చిన సిద్దు.. ఘాటు విమర్శలు

Posted: 07/20/2016 11:14 AM IST
Siddaramaiah attacks bjp over georg s resignation rules out cbi probe

కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన మాజీ మంత్రివర్గ సహచరుడ్ని వెనకేసుకోచ్చారు. డిఫ్యూటీ పోలీసు సూపరింటెండ్ అధికారి గణపతిపై ఒత్తిడి తీసుకువచ్చి.. ఆయన ఆత్మహత్యకు కారణమైయ్యారన్న అరోపణలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన కేజీ జార్జీను సిద్దరామయ్య వెనకేసువచ్చారు. అంతేకాదు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసే నైతిక హక్కు బీజేపి నేతలకు లేదని విమర్శించారు. శవా రాజకీయాలు చేయవద్దని బీజేపి నేతలను సూచించారు. ఇలాంటి శవ రాజకీయాల పట్ల తమకు నమ్మకం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్తతిపక్షాలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో ఒక వైఖరి, తాము అధికారంలో వున్న దేశం, రాష్ట్రాల్లో మరో విధానాన్ని అవలంభిస్తుందని సిద్దు విమర్శించారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్య వ్యవహారంలో మంత్రి కేజే జార్జి రాజీనామా అడిగుతున్న నేతలు ముందుగా కేంద్రమంత్రుల రాజీనామాలను అడగాలని చురకలంటించారు. న్యాయస్థానం కేసు నమోదు చేయాలని అదేశించిన వెంటన ఆయన స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేశారని సిద్దు చెప్పారు. మరి తమపై ఎఫ్ఐఆర్ లు నమోదైనా కేంద్రమంత్రులు తమ పదవులకు ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.

హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య వ్యవహారంలో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీపై కేసులు నమోదైనా వారెందుకు రాజీనామా చేయించలేదని బీజేపీని ప్రశ్నించారు. 'మాథుర వైద్యుడి మృతి కేసులో స్మృతి ఇరానీపై ఎఫ్ఐఆర్ నమోదయింది. ఆమెకు మంత్రిగా కొనసాగే హక్కు ఉందా? నరేంద్ర మోదీ కొత్తగా తీసుకున్న 19 మంత్రుల్లో ఏడుగురిపై క్రిమినల్ కేసులున్నాయి. దీనిపై బీజేపీ ఎందుకు నోరు మెరపలేదని ప్రశ్నించారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్య వ్యవహారంలో మంత్రి జార్జ్‌కు ఎలాంటి సంబంధం లేదని, విపక్షాలు తమ స్వార్థం కోసం ఆయన్ను బలిపశువును చేశాయని సిద్దరామయ్య వాపోయారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddaramaiah  Karnataka CM  Smriti Irani  Bandaru Dattatreya  KG George  poltics  

Other Articles