కేవీపీ హోదా బిల్లుపై ఎలాంటి చర్చ జరగబోతోంది | KVP's private bill on AP special status discuss on July 22

Kvp s private bill on ap special status discuss on july 22

Congress MP KVP's private bill, AP special status voting, July 22 in Rajyasabha, black friday for AP, KVP's private bill

Congress MP KVP's private bill on AP special status discuss on July 22 in Rajyasabha.

టెన్షన్: ఈ శుక్రవారం ఏం జరగబోతోంది?

Posted: 07/20/2016 11:12 AM IST
Kvp s private bill on ap special status discuss on july 22

నవ్యాంధ్రకు ప్రత్యేక హోదాను కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వేసిన ప్రైవేట్ మెంబర్ బిల్లు జూలై 22వ తేదీ శుక్రవారం, అంటే ఎల్లుండి చర్చ, ఓటింగ్ కు రానుంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా కేవీపీ బిల్లుకు మద్దతు పలకాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేయడంతో ఏం జరగబోతుందా అన్న ఆత్రుత నెలకొంది. స్పెషల్ స్టేటస్ పై బీజేపీ ఎన్నికలకు ముందు ఓ మాట, ఆపై మరో మాట మార్చి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నదన్న ఆరోపణల నేపథ్యంలో చర్చపై బీజేపీ ఎలాంటి అడుగులు వేయబోతుందా అని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా కంటే కూడా ఎక్కువే చేస్తున్నామని చెబుతున్న నరేంద్ర మోదీ సర్కారు... ప్రత్యేక హోదా ప్రకటనకు చాలా అడ్డంకులున్నాయని వాదిస్తోంది. రాజ్యసభలో అసలు కేవీపీ బిల్లును చర్చకే రానివ్వమని బీజేపీ నేత హరిబాబు చెబుతున్నారు. హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తున్న నేపథ్యంలో దానిపై చర్చ అప్రస్తుతం అని కుండబద్ధలు కొట్టారు.

మరోవైపు కాంగ్రెస్ మాత్రం, తమ హయాంలో హామీ ఇచ్చామని, బీజేపీ సైతం ప్రత్యేక హోదాకు అప్పట్లో అంగీకరించి, ఇప్పుడు మాట తప్పిందని ఆరోపిస్తూ, ఓటింగ్ పై విప్ ను కూడా జారీ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ బిల్లుకు తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ ఎంపీలు సైతం అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితిని కల్పించింది. ఈ నేపథ్యంలో బిల్లు ఏమవుతుందన్న చర్చ జరుగుతోంది. బిల్లుకు అనుకూలంగా ఓటు పడుతుందా? రాష్ట్రానికి మేలు కలుగుతుందా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

మొత్తం 245 మంది సభ్యులు గల రాజ్యసభలో ఎన్డీఏకు 72 మంది సభ్యులున్నారు. బీజేపీ 54, టీడీపీ 6, శిరోమణి అకాలీ దళ్ 3, శివసేన 3, పీడీపీ 2, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్, నాగా పీపుల్స్ ఫ్రంట్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథావలే), సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీలకు ఒక్కో సభ్యుడి చొప్పున ఉన్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన యూపీఏ తరఫున 66 మంది సభ్యులుండగా, కాంగ్రెస్ కు 60, డీఎంకే 4, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ లకు ఒక్కో సభ్యుడి చొప్పున బలముంది. జనతా పరివార్ పార్టీకి 15 మంది సభ్యుల బలముండగా, జనతాదళ్ తరఫున 10 మంది, రాష్ట్రీయ జనతాదళ్ తరఫున ముగ్గురు, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జనతాదళ్ సెక్యులర్ పార్టీలకు ఒక్కో సభ్యుడి చొప్పున ఉన్నారు. ఇక ఇతర పార్టీల్లో సమాజ్ వాదీ 19, అన్నాడీఎంకే 13 తృణమూల్ కాంగ్రెస్ 12, బిజూ జనతాదళ్ కు 8, సీపీఐ (ఎం) కు 8, బీఎస్పీకి 6, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి 5, టీఆర్ఎస్ కు 3, సీపీఐ, జార్ఖండ్ ముక్తి మోర్చా, వైఎస్ఆర్ సీపీలకు ఒక్కో సభ్యుడి చొప్పున బలముంది. వీరు కాక 10 మంది నామినేటెడ్ సభ్యులు, నలుగురు ఇండిపెండెంట్లు ఉండగా, మరో సీటు ఖాళీగా ఉంది.

ఏపీకి హోదా బిల్లుపై అటు ఎన్డీయే, ఇటు యూపీఏకు ప్రత్యక్షంగా మద్దతు పలకని అన్నాడీఎంకే, సమాజ్ వాదీ, తృణమూల్ పార్టీలు ఏ వైపు నిలబడతాయన్న విషయం అత్యంత ఆసక్తికరం. సీపీఐ, సీపీఎం, వైసీపీ, బీఎస్పీలు కాంగ్రెస్ కు మద్దతిచ్చేలాగానే కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో తెలుగుదేశం ఆరుగురు సభ్యులు సైతం తప్పనిసరిగా ఓటు వేయాల్సిన పరిస్థితి. ఇదే జరిగితే అధికార పక్షానికి తీవ్ర ఇబ్బందే.

ఏదిఏమైనా మరో రెండు రోజుల్లో రాజ్యసభలో ప్రత్యక హోదా బిల్లుపై ఎలాంటి చర్చ జరుగుతుందో, ఒకవేళ ఓటింగ్ జరిగితే ఫలితమేంటోనని నరాలు తెగే ఉత్కంఠ నెలకోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  TDP  KVP  private bill  special status  

Other Articles