అరుణా చల్ ప్రదేశ్ కి కొత్త సీఎం | Pema Khandu will next CM for Arunachal Pradesh

Pema khandu will next cm for arunachal pradesh

Arunachal Pradesh new CLP chief, Pema Khandu, Arunachal Pradesh CM Pema Khandu, Nabam Tuki steps down, Nabam Tuki resignation

Pema Khandu will next CM for Arunachal Pradesh.

ఏపీ సీఎంను మార్చేస్తున్నారు

Posted: 07/16/2016 01:11 PM IST
Pema khandu will next cm for arunachal pradesh

లైట్ తీస్కోండి. చెప్పేది ఆంధ్రప్రదేశ్ గురించి కాదు, అరుణాచల్ ప్రదేశ్ గురించి... పెను రాజకీయ సంచలనాలకు నిలయంగా మారిన ఆ రాష్ట్రంలో మరిన్ని ఆశ్చర్యకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో కోల్పోయిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకున్న ఆనందం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నాబమ్ తుకీకి ఎక్కువ సేపు నిలవలేదు. ఆయన తన పదవి నుంచి దిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శనివారం ఉదయం గవర్నర్ తతాగట రాయ్ కి కలిసిన తుకీ సీఎల్పీ నేతగా తన రాజీనామా పత్రం సమర్పించాడు. అనంతరం పేమా ఖండూ కొత్త చీఫ్ గా ప్రమాణం చేశారు. తీర్పు అనంతరం బలపరీక్షకు సిద్ధం కావాలని గవర్నర్ ఆదేశించగా, అందుకు సమయం కావాలని తుకీ కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజే బలపరీక్ష ఉండొచ్చని సమాచారం. మరోవైపు తనవైపు 35 మంది ఉన్నారంటూ తుకీ చెబుతున్నారు.

Prema Khandu new CM for Arunachal Pradesh

బలపరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతో శుక్రవారం రాత్రి భేటీ అయిన ఆ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్షం తమ నేత(సీఎల్పీ నేత) గా నబం తుకీ స్థానంలో పేమా ఖండూను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో బల పరీక్ష నెగ్గినా సరే ఆ వెంటనే ఆయన్ని సీఎం పీఠం నుంచి దించేసి ఆ స్థానే ఖండూని నియమించే అవకాశం ఉంది. కోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్ ఆదేశాలు చెల్లవని ఓ వైపు తుకీ వర్గం చెబుతుంటే... రాజ్ భవన్ మాత్రం బల పరీక్ష జరిగి తీరాల్సిందేనని పట్టుబడుతోంది. దీనిపై ఆయన మరోసారి సుప్రీం తలుపును తట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arunachal Pradesh  Nabam Tuki  Pema Khandu  

Other Articles