వివాదాస్పద పాక్ మోడల్ హత్య | Pak Model Qandeel Baloch murdered by her brother

Pak model qandeel baloch murdered by her brother

Pak Model murdered, Pakistan Model Qandeel Baloch, Qandeel Baloch killed by bother, Qandeel Baloch killed, Qandeel Baloch murder, Qandeel Baloch case, Qandeel Baloch news

Pakistan Model Qandeel Baloch murdered by her brother.

ITEMVIDEOS:హత్యకు గురైన మోడల్ వైరల్ వీడియో

Posted: 07/16/2016 01:45 PM IST
Pak model qandeel baloch murdered by her brother

ఫేస్ బుక్, ట్విట్టర్లలో పలు అభ్యంతకర పోస్టులతో పేరొందిన సంచలన మోడల్ ఖాందిల్ బాలోచ్ హత్య గావించబడింది. పాకిస్థాన్ కు చెందిన ఈ వివాదాస్పద మోడల్ సోదరుడి చేతిలోనే హత్యకు గురైనట్లు ముల్తాన్ పోలీసులు తెలిపారు.

ఇస్లామిక్ కుటుంబానికి చెందిన బాలోచ్ ఎక్స్ పోజింగ్ బాట పట్టడమే కాదు. తరచూ నగ్న ఫోటోలు పోస్ట్ చేస్తూ కవ్వింపు చర్యలకు దిగేది. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా పాక్ ఇండియాపై మ్యాచ్ గెలిస్తే నగ్న ప్రదర్శన ఇస్తానని మన పూనం తరహాలోనే ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది కూడా. ఆపై మ్యాచ్ ఓడిపోవటంతో తీవ్ర పదజాలంతో అఫ్రిదీ అండ్ కోను దూషించింది. ఇందుకుగానూ ఆమెపై కేసులు కూడా నమోదు అయ్యాయి. పాశ్చాత్య సంస్కృతిని వ్యతిరేకించే వారిపై బహిరంగంగానే విమర్శలు గుప్పించిన ఆమె ఒక సందర్భంలో ఆ దేశ అధ్యక్షుడిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి తీవ్ర దుమారానికి తెరలేపింది.

మొదటి నుంచి బాలోచ్ వ్యవహార సరళిపై కోపంతో ఉన్న ఆమె సోదరుడు ఇవేం పనులంటూ పలుమార్లు ఆమెను హెచ్చరించాడట. అయినా ఆమె తన పని తాను చేసుకుపోయింది. దీంతో తన మాట వినడం లేదన్న కారణంగానే అతడు తుపాకీతో కాల్చేశాడంట. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా ఫోటోలు పెడుతూ, తమ కుటుంబం పరువును తీస్తున్నందునే సోదరి ఖండీల్ బాలోచ్ ను హత్య చేశానని, ఇందుకు చింతించడం లేదని మహమ్మద్ వసీమ్ చెబుతున్నాడు. తను తప్పు చేసిందని, అందుకే చంపాల్సి వచ్చిందని నిర్దయగా మాట్లాడాడు.

కాగా గతంలో టీ20 లో కోహ్లీ వీరవిహారం చేసిన టైంలో అతనికి ప్రపోజ్ చేస్తూ ఓ వీడియోను కూడా అప్ లోడ్ చేసింది. అప్పట్లో అది సంచలనంగా మారింది. ఇప్పుడు దానిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అంతా ఆమెను గుర్తుచేసుకుంటున్నారు. ఆ వీడియోను మీరూ ఓసారి వీక్షించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  model  Qandeel Baloch  murder  

Other Articles