GET NAKED AT WORK! employees stripped off while working after Belarus president’s slip of the tongue goes viral

Europe s last dictator orders workers to strip naked at work leading to some saucy scenes

Belarus, Aliaksandr Yarashuk, employees, undressed, house of representatives, Belarusian Congress, Democratic Trade Unions, main lobbyist, new law, Labour Minister Maryanna Shchotkina

Europe's last dictator, Belorussian President, Alexander Lukashenko, 61, has order his people to get their kit off at work during an unfortunate slip of the tongue.

ITEMVIDEOS:అధ్యక్షుడి వ్యాఖ్యల ఎఫెక్ట్.. ఉద్యోగుల నగ్న విధులు..

Posted: 06/30/2016 09:19 AM IST
Europe s last dictator orders workers to strip naked at work leading to some saucy scenes

మీరు చచ్చైనా నాకు ఆ పని పూర్తి చేయాలి అని మీ బాస్ అన్నారు అనుకోండి మీరు ఏం చేస్తారు. ఆత్మహత్య చేసుకోవడం కోసం ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటారా..? లేక మీ బాస్ చెప్పిన పనిని త్వరగా పూర్తి చేసి హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటారా..? ఎంత తెలివి తక్కువ వారైనా రెండో అప్షన్ నే ఎంచుకుంటారు. ఎందుకంటే బాస్ అన్న దానిలో అర్థం పని పూర్తి కావాలన్నదే. కానీ మీరు చావాలన్నది అర్థమూ కాదు అంతరార్థమూ కాదు. అయితే అక్కడ ఉద్యోగులు మాత్రం అందుకు బిన్నం.

తూర్పు యూరప్ దేశమైన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో దేశ సమగ్రాభివృధ్ధి కోసం ఉద్యోగులందరూ కష్టపడాలని కాస్తాంత ఘాటైన వ్యాఖ్యలతో అన్నాడు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు ఆయన భావగర్భితంగా ఇచ్చిన పిలుపును కాస్త ఉద్యోగులు మరో రకంగా తీసుకున్నారు. ఆయన భావాన్ని అర్థం చేసుకుండా ఆయన చెప్పిన మాటలను అక్షరాల అమలుచేస్తూ ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేస్తున్నారు. తమ నేత వ్యాఖ్యలను అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించేలా చేస్తున్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి అంకితభావంతో కష్టపడి పనిచేయడం ఎంత అవసరమో స్ఫూర్తిదాయకంగా చెప్పిన లుకషెంకో బోల్తాపడ్డారు.

ఇంతకీ అధ్యక్షుడు లుకషెంకో ఏమన్నారంటే.. ‘గెట్ అన్‌డ్రెస్డ్ అండ్ వర్క్ టిల్ యు గెట్ స్వెట్ (బట్టలిప్పుకొని పనిచేయండి చెమటలు కక్కేదాక)’ అంటూ ఆయనిచ్చిన సందేశంలోని సోమరితనం, నిర్లక్ష్యాలను వదిలి, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలన్న సారాంశాన్ని పట్టించుకోకుండా బెలారస్ ఉద్యోగులు ఆయన మాటలను అక్షరాల అమలు చేయడానికి ఆఫీసుల్లో బట్టలిప్పుకొని పనిచేస్తున్నారు. అలా పనిచేస్తున్న దృశ్యాలను ఫొటోలుతీసి మరి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో వేల కోద్ది ఫోటోలను ఎడతెరపి లేకుండా పోస్ట్ చేస్తున్నారు. కామెంట్లు కూడా పెడుతున్నారు..

అయితే ఈ ఫొటోల్లో మగవాళ్లతో పాటు మహిళా ఉద్యోగులు కూడా బట్టలు లేకుండా ఫొటోలు దిగడం యూరప్‌ లాంటి దేశంలో కూడా కొంత ఆశ్చర్యమే. కాకపోతే వారంతా తమ మానాన్ని రక్షించుకునేందుకు లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు అడ్డుగా పెట్టుకోగా, కొందరు మహిళలు లో దస్తుల్లో విధులు నిర్వహించవడం కనబడుతుంది. ఇది ఒక్క ఉద్యోగస్థులకే పరిమితం కాలేదు. సంగీత కళాకారులు కూడా బట్టలిప్పేసి వాయిద్యాలతో మానాన్ని దాచుకుంటూ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. వారిని భవన నిర్మాణ కార్మికులు కూడా అనుసరిస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్  చేస్తున్నారు. ఇక అధ్యక్షులు లుకషెంకో దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Belarus  Aliaksandr Yarashuk  employees  undressed  house of representatives  

Other Articles