రేప్ బాధితురాలితో నవ్వుతూ ఓ సెల్ఫీ | selfie with rape victim woman commission member landed troubles

Selfie with rape victim woman commission member landed troubles

Rajasthan rape victim selfie, selfie with rape victim woman commission member, selfie with rape victim lands trouble, Suman Sharma is also in the selfie along with the member Somya Gurjar

selfie with rape victim woman commission member landed troubles in Rajasthan.

రేప్ బాధితురాలితో నవ్వుతూ ఓ సెల్ఫీ

Posted: 06/30/2016 09:21 AM IST
Selfie with rape victim woman commission member landed troubles

ప్రతి అంశానికి ప్రచారం చేసుకోవడం.. సోషల్ మీడియాలో వాటిని పోస్టు చేయడం ఒక వ్యాధిలా వ్యాప్తిస్తున్న తరుణంలో చేయకూడని పనులకు కూడా ప్రచారాన్ని తెచ్చుకోవాలని భావిస్తున్నారు నేతలు. అలాంటి సెల్ఫీలకు ఇది పరాకాష్ట. అన్యాయానికి గురైన ఆడవారికి సమాజంలో అండగా నిలుస్తామని చెప్పే వారే సదరు బాధిత మహిళల పరువు, మర్యాదలను మంటగలుపుతున్నారు. తమకు తాము ప్రచారం చేసుకునేందుకు ఇలాంటి చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారు.

సాధారణంగా అత్యాచార బాధితుల పేర్లు గానీ, వాళ్ల వివరాలు గానీ ఎక్కడా వెల్లడించరు. కానీ అలాంటి బాధితురాలిని ఓదార్చేందుకు వచ్చిన బాధ్యత గల మహిళా సభ్యురాలు అమెపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండించడానికి బదులు.. ఆమెతో సెల్ఫీ దిగి సొంత ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. అమె చర్యలను నెట్ జనులు తీవ్రంగా అక్షేపిస్తున్నారు. బాద్యతగల మహిళా కమీషన్ సభ్యురాలిగా కోనసాగుతున్న వారే ఇలాంటి చర్యలకు తెగబటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

రాజస్థాన్‌లోని అంబర్ సమీపంలో కట్నం ఇవ్వలేదన్న కోపంతో భార్యపై భర్త, అతని ఇద్దరు సోదరులు అత్యాచారానికి పాల్పడి ఆపై ఆమె నుదిటిపై అసభ్యకర పచ్చబొట్టు వేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాజస్థాన్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సుమన్ శర్మ, సభ్యురాలు సోమ్యా గుర్జార్ బాధితురాలిని కలిసేందుకు మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ బాధితురాలితో గుర్జార్ సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీలో సుమన్ శర్మ కూడా కనిపిస్తున్నారు. గుర్జార్ సెల్ఫీ దిగుతుండగా ఎవరో దానిని ఫొటో తీసి వాట్సాప్‌లో పోస్టు చేశారు.

వాట్సాప్‌లో ఇప్పుడా ఫొటో వైరల్ అవుతోంది. అయితే తాను బాధితురాలితో మాట్లాడుతుండగా గుర్జర్ ఈ ఫొటోలు తీశారని, ఆమె తీస్తున్న విషయం కూడా తనకు తెలియదని చైర్పర్సన్ సుమన్ శర్మ చెప్పారు. ఇలాంటి వాటిని తాను సహించేది లేదని, అందుకే ఆమెనుంచి రాతపూర్వక వివరణ కోరానని అన్నారు. కాగా గుజ్జర్ ను తక్షణం మహిళా కమిషన్ నుంచి తొలగించాలన్న డిమాండ్ కూడా తెరపైకి వస్తుంది. ఏ చిత్రంలోనే అడవారిపై కొంత వ్యతిరేక మాటలో. సన్నివేశాల్లో వస్తే.. వాటిపై గగ్గోలు పెట్టే మహిళా సంఘాలు.. కమీషన్ సభ్యురాలే ఇలాంటి చర్యలకు పాల్పడటం పట్ల ఎలా స్పందిస్తారో వారికే తెలియాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan  woman commission member  Somya Gurjar  selfie  rape victim  

Other Articles