కేసీఆర్ మరో కేజ్రీలా తయారవుతున్నాడు | sadananda gowda fire on CM KCR for high court division

Sadananda gowda fire on cm kcr for high court division

law minister sadananda gowda compare KCR with Kejriwal, sadananda gowda fire on telangana CM, sadananda gowda CM KCR, sadananda gowda on telangana high court, కేజ్రీలా కేసీఆర్, కేజ్రీవాల్ తో కంపేర్ చేసిన కేసీఆర్, సదానందగౌడ కేసీఆర్, కేసీఆర్ కేజ్రీవాల్ లాగా, కేసీఆర్ మరో కేజ్రీవాల్

Union law minister sadananda gowda compare KCR with Kejriwal. Counter on KCR protest comments about high court division.

ITEMVIDEOS:కేసీఆర్ మరో కేజ్రీలా తయారవుతున్నాడంట!

Posted: 06/28/2016 05:28 PM IST
Sadananda gowda fire on cm kcr for high court division

ప్రత్యేక హైకోర్టు కావాలంటూ తెలంగాణ న్యాయవాదులు రోడెక్కి చేస్తున్న రగడ కేంద్రం దృష్టికి చేరింది. ఇప్పటిదాకా ఉమ్మడి హైకోర్టుతోనే తెలుగు రాష్ట్రాలు నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రా జడ్జిల ఆధిపత్యం ఎక్కువైపోతుందని ఆరోపిస్తూ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందేనంటూ గత కొద్దిరోజులుగా టీ లాయర్లు నిరసనలు చేస్తున్నారు. రాను రాను ఉద్యమం తీవ్ర రూపం దాల్చటం, జడ్జిలపై వేటు పడుతుండటంతో విషయం కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్లింది.

దీంతో న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యవహార శైలి మరో కేజ్రీవాల్ లా ఉందని ఆయన చెప్పారు.  హైకోర్టు కోసం ఒక సీఎం అయి ఉండి కేంద్రాన్ని విమర్శించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. హైకోర్టును విభజించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం ఇప్పటికే ఇరు రాష్ట్రాల సీఎంలతో తాను చర్చలు జరిపానని ఆయన చెప్పారు.

ఏపీలో హైకోర్టుకు అవసరమైన మౌలిక వసతులు లేకపోగా, తెలంగాణలో మరో ప్రాంతంలో హైకోర్టును నిర్వహించేందుకు టీ సర్కార్ సిద్ధంగా లేకపోవటాన్ని ప్రధాన కారణాలుగా ఆయన వివరించారు. ఈ విషయంలో ముందడుగు వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు ఇంకా అనుకూలించలేదని అన్నారు. ఒకవేళ హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు సర్కారు స్థలం చూపిస్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తామని ఆయన వివరించారు. నిజానిజాలు గుర్తించకుండా కేసీఆర్ అండ్ కో తమను విమర్శిస్తున్నారని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల హైకోర్టు విభజన కేసు పెండింగ్ లో ఉండగా, కేంద్రం ఏమీ చేయలేదన్న సంగతి కేసీఆర్ కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తానని కేసీఆర్ మాట్లాడటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, కనీసం పదేళ్ల పాటు హైకోర్టు హైదరాబాద్ లో ఉండటానికి అవకాశాలను విభజన చట్టం కల్పించిందని ఆయన గుర్తు చేశారు. సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలే తప్ప కేజ్రీవాల్ మాదిరిగా, ధర్నాలు, నిరసనలు తెలిపితే తమదేకీ అభ్యంతరం లేదని, దానివల్ల శాంతిభద్రతల సమస్యలు తప్ప మరేమీ ప్రయోజనం ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. తన దృష్టికి వచ్చిన అంశాలను వివరిస్తూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ లకు లేఖ రాస్తానని సదానంద గౌడ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Union law minister  sadananda gowda  KCR  Kejriwal  

Other Articles