స్వాతి హత్య కేసులో ఆడియో క్లిప్ హల్ చల్ | Infosys techie Swathi's voice clip hulchul in whatsapp

Infosys techie swathi s voice clip hulchul in whatsapp

Infosys techie Swathi, Infosys techie Swathi audio clip, Swathi's heart touching voice clip hulchul in whatsapp, ఇన్పోసిస్ స్వాతి ఆడియో క్లిప్, స్వాతి మర్డర్ కేసులో ఆడియో క్లిప్ హల్ చల్, వాట్సాప్ లో ఇన్సోసిస్ స్వాతి ఆడియో, టెక్కీ స్వాతి కేసులో ఆడియో క్లిప్

Infosys techie Swathi's heart touching voice clip hulchul in whatsapp.

స్వాతి హత్య కేసులో ఆడియో క్లిప్ హల్ చల్

Posted: 06/28/2016 03:46 PM IST
Infosys techie swathi s voice clip hulchul in whatsapp

చెన్నైలో ఇన్ఫోసిస్ ఉద్యోగినిని ఓ నరరూప రాక్షసుడు నాలుగు రోజుల క్రితం హతమార్చిన సంగతి తెలిసిందే. సీసీ పుటేజ్ లు లేకపోవటంతో విచారణలో జాప్యం తీవ్రంగా మారింది. ప్రత్యక్ష సాక్షులను విచారించినప్పటికీ పెద్దగా ఆనవాళ్లను రాబట్టలేకపోయారు. అయితే రద్దీ ఉన్న స్టేషన్లో స్వాతిని చంపుతుంటే చోద్యం చూశారే తప్ప ఎవరూ అడ్డుకునేందుకు ప్రయత్నించకపోవటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం స్వాతి ఆడియో టేప్ ఒకటి వాట్సాప్ గ్రూపులలో హల్ చల్ చేస్తోంది.

‘‘నేను స్వాతిని మాట్లాడుతున్నా. నేను చనిపోయిన నాలుగు రోజులైనా మీడియా చొరవతో మరికొన్ని రోజులు బతికే ఉంటాను. కాబట్టి నేను మాయమైపోయేముందు మీతో కొన్ని విషయాలు పంచుకుందామనుకుంటున్నా. నేను మీలాగే ఓ మాములు వ్యక్తిని. మిగతా రోజుల్లో పని చేసుకుంటూ వీకెండ్ లో సరదాగా ఎంజాయ్ చేయాలని చూసే ఓ సాధారణ ఉద్యోగిణినే. నా తల్లిదండ్రులు కూడా నా మీద బోల్డెన్నీ ఆశలు పెట్టుకున్నారు. ప్రతీ రోజులాగే ఆ రోజు ఆఫీసుకు బయలుదేరాను. ఆ రోజు నాపై జరిగిన దాష్టీకాన్ని మీలో ఎంత మంది చూశారో నాకు తెలీదు. అలాగే మీలో ఎంతమంది ఆడవాళ్లపై జరిగే దారుణాల గురించి ఉపన్యాసాలు దంచుతారో కూడా తెలీదు. కానీ, నాపై దాడి జరుగుతుంటే ఎవరూ కదలలేకపోయారు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న నాకు కనీసం మంచి నీరు అందించి సాయం చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఫలితం నా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయాయి. మీకు నేను చేసే విజ్నప్తి ఒక్కటే మీ ఇంట్లో ఆడపిల్లలకు బయటికి వెళ్లే ముందు జాగ్రత్త అని చెబుతారు కదా. అలాగే మగపిల్లలకు కూడా అదే చెప్పండి. తద్వారా నాలాంటి యువతులపైనా, మహిళలపైనా దాడులు జరగకుండా చూస్కోండి’’ అంటూ ఆ ఆడియో క్లిప్ లో ఉంది.

ప్రస్తుతం ఎవరి వాట్సాప్ గ్రూప్ చూసినా ఇదే ఆడియో క్లిప్. ఇది విన్న వారి హృదయాలు కన్నీరు కారుస్తున్నాయి. మరోవైపు కేసులో నిందితుడిని ఇంతవరకు పట్టుకోకపోవటంపై మహిళా సంఘాలు నిరసనకు దిగాయి. దీంతో ఆగ్రహించిన మద్రాస్ న్యాయస్థానం పోలీస్ శాఖకు మొట్టికాయలు వేసింది. రెండు రోజుల తర్వాత కూడా దర్యాప్తు మందకొడిగా సాగుతున్నట్టు మాకు అనిపిస్తే చీఫ్ జస్టిస్ ఆదేశాలతో సుమోటోగా స్వీకరించి విచారిస్తాం అంటూ బెంచ్ హెచ్చరికలు జారీచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Infosys techie  Swathi  voice clip  hulchul  whatsapp  

Other Articles