పెళ్లాంతో జోక్ చేసినందుకు ఏమైందంటే... | man punished with flogging for joking with wife

Man punished with flogging for joking with wife

Saudi Arabia, saudi husband, 20 lashes, joking with wife, husband flogging

Saudi Arabia husband punished with 20 lashes for joking with wife.

భార్యతో జోక్ చేసిన భర్తకు ఏమైందంటే...

Posted: 06/24/2016 01:03 PM IST
Man punished with flogging for joking with wife

మొగుడు పెళ్లాలు అన్నాక చిలిపి సరసాలు ఉండాలనుకున్న భర్త ఆమె భుజంపై మెల్లిగా తట్టాడు. అంతే నా మొగుడు నన్ను కొట్టి చంపాలనుకున్నాడంటూ బాబోయ్ ఆమె గగ్గోలు పెట్టింది. ఏకంగా కోర్టు గుమ్మం ఎక్కింది. గాయాలు చూడండి అంటూ మెడికల్ రిపోర్ట్ లు సమర్పించి పక్కా ఆధారాలతో మొగుడిని బుక్ చేసింది. మరి కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో చూడండి...

చట్టాలు కఠినంగా అమలు చేసే సౌదీ అరేబియాలో ఈ ఘటన చోటుచేసుంది. 30 ఏళ్ల ఆ భర్త ఏదో సరదా కోసం తన భార్యపై ఓ దెబ్బ వేశాడంట. అసలు ఆమెను గాయపరచటం తన ఉద్దేశం కాదని, ఏదో జోక్ గా అలా చేశానని అతను కోర్టు ముందు మొత్తుకున్నాడు. కానీ, కనికరించని న్యాయస్థానం అతనికి 20 కోరడా దెబ్బల శిక్ష విధించింది.

తన భర్త చిలిపితనం, మంచి మనసు లేటుగా అర్థం చేసుకున్న భార్య శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని ఫ్రాధేయపడింది. అయితే అందుకు ససేమిరా అన్న జడ్జి ఆ బహిరంగ శిక్షకు ఆమె కూడా హజరు కావాల్సిందేనని బల్లగుద్ది మరీ తీర్పు ఇచ్చాడు. అక్కడి చట్టం ప్రకారం మొగుడ్ని కోరడాతో, కర్రతో వాయగొడుతుంటే ఆమె కన్ను ఆర్పకుండా చూడాలన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saudi Arabia  husband  flogging  20 lashes  

Other Articles