పెళ్లయిన యువతికి లవ్ సెట్ చేసిన వైసీపీ నేత | YSRCP leader Jogi Ramesh reunites Manasa With Lover

Ysrcp leader jogi ramesh reunites manasa with lover

Jogi Ramesh reunites Manasa, Manasa Hemanth lovestory, YSRCP leader hero for love story, Manasa suicide attempt, తాజా వార్తలు, జోగిరమేష్ ప్రేమ జంట, లేచిపోయిన జంటను కలిపిన వైసీపీ నేత, వైసీపీ నేత ప్రేమ వ్యవహారం, తాజా వార్తలు, ఏపీ వార్తలు, latest news, AP news

Jogi Ramesh reunites Manasa With Lover. An NRI Girl Manasa was married to an NRI Boy and was settled in America 6 months back. It is reported that Manasa was in a relationship before marriage, to which she left her husband and came back India for her boyfriend, resulting which family didn't support her to which she attempt suicide.

పెళ్లయిన యువతికి లవ్ సెట్ చేసిన వైసీపీ నేత

Posted: 06/24/2016 02:00 PM IST
Ysrcp leader jogi ramesh reunites manasa with lover

వైసీపీ నేత జోగి రమేష్. రాజకీయాల్లోనే కాదు అవసరమైతే వ్యక్తిగత వ్యవహారాల్లోకి చొరబడి మరీ వారికి సేవ చేస్తానంటున్నాడు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ నేత ఓ ప్రేమ వ్యవహారన్ని చక్కబెట్టి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. అందులో వార్తేముంది అంటారా? ఆమెకు అల్రెడీ పెళ్లయిపోవటమే ఇక్కడ ట్విస్ట్. కట్టుకున్నోడి కళ్లు గప్పి లేచిపోయి వచ్చింది... పుట్టింటోళ్లు వద్దన్నారు.... ప్రియుడు కనిపించకుండా పోయాడు. ఇప్పుడేం చేయాలి అని అనుకుంటున్న సమయంలో నేనున్నాను అంటూ ముందుకొచ్చాడు

విజయవాడకు చెందిన మానసకు, ప్రభాకర్ తో ఆరు నెలల క్రితం వివాహం చేశారు. పెళ్లికాగానే ఆ ఇద్దరు అమెరికాకు వెళ్లిపోయారు. కానీ, పెళ్లికి ముందే హేమంత్ అనే యువకుడిని ప్రేమించిన యువతి అతన్ని మరిచిపోలేకపోయింది. తరచూ ప్రియుడితో ఫోన్ లో మాట్లాడుతూనే ఉంది. తనపై ప్రేమ చావకపోతే భర్తను వదిలేసి వచ్చేయిమని సలహా ఇచ్చాడు అతగాడు. దీంతో రెక్కలు కట్టుకుని అమెరికా నుంచి వాలిపోయింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.

హైదరాబాద్ లో దిగిన ఆమెకు ప్రియుడు కనిపించలేదు. హ్యాండిచ్చాడని భావించిన ఆమె తిరిగి పుట్టింటికి వెళ్దామని ప్రయత్నించింది. వారు ఛీకొట్టారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ యువతి నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరింది. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న వైసీపీ నేత జోగి రమేశ్ రంగంలోకి దిగారు. ప్రియుడిని జుట్టుపట్టి ఆసుపత్రికి తీసుకొచ్చి మరీ ఆమె దరి చేర్చారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP Leader  Jogi Ramesh  Manasa Hemanth  

Other Articles