Reliance Communications to Offer 4G at Rs. 93 for 10GB Data Using Jio's Network

Rcom to use reliance jio network from next week to offer 10 gb at rs 93

Reliance Jio, Reliance communications, DoT, 4G, india, jio, jio 4g, rcom, reliance, reliance communications, reliance jio, telecom

Customers of Reliance Communications' high-speed data services will be able to use Reliance Jio Infocomm's 4G network from next week, sources said.

తమ వినియోగదారులకు రిలయన్స్ బంఫర్ ఆఫర్..

Posted: 06/24/2016 12:34 PM IST
Rcom to use reliance jio network from next week to offer 10 gb at rs 93

రిలయన్స్ కమ్యూనికేషన్ తన వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. 4జీ సేవలను రిలయన్స్ జియో పేరుతో ప్రారంభించిన రిలయన్స్.. తమ కస్టమర్లను ముఖ్యంగా సీడీఎంఏ ఫోన్ల వినియోగదారులకు పెంచుకునేందుకు చక్కని ప్రణాళికను అందుబాటులోకి తీసుకోచ్చింది. తమ సీడీఎంఏ కస్టమర్ల కోసం అత్యంత చౌకధరకే 4జీ సేవలను అందించనుంది. కేవలం 93 రూపాయలకే 10 గిగాబైట్స్(జీబీ)తో 4జీ సేవలను అందించాలని నిర్ణయించింది.

వచ్చే వారం నుంచి అన్ని ప్రముఖ నగరాలలో 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది రిలయన్స్ సంస్థ. ఈ మేరకు టెలికం డిపార్ట్‌మెంట్‌కు లేఖ రాసింది. జియో నెట్‌వర్క్ ద్వారా ఈసేవలు అందించనున్నామని, సీడీఎంఏ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. 80 లక్షల మంది రియలన్స్ వినియోగదారుల్లో 90శాతం మంది 4జీకి మారినట్టు కంపెనీ పేర్కొంది. ‘‘రూ.93కే 10జీబీ 4జీ డాటాను అందించనున్నాం. ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే 94శాతం తక్కువ ధరకు ఈ సేవలను ఆఫర్ చేస్తున్నట్టు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ముంబై, కోల్‌కతా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, మధ్య ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో వచ్చేవారం నుంచి రూ.93 నుంచి రూ.97తో ఈ సేవలు లభిస్తాయని తెలిపింది. అయితే రిలయన్స్ ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుండటంతో మిగతా టెలికాం సంస్థలు కూడా తమ 4జీ సేవలను గణనీయంగా తగ్గించే అవకాశాలు వున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిలయన్స్ టెలికాం రంగంలో అడుగుపెట్టడంతో అప్పటి వరకు వున్న బాదుడును వదులుకుని ఉచిత ఇన్ కమింగ్ తో పాటు ఔట్ గోయింగ్ టారిఫ్ లలో కూడా భారీ మార్పులకు నాంది పలికింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance Jio  Reliance communications  DoT  4G  

Other Articles