Murthal rapes, Naked women took shelter in dhaba

Eyewitnesses confirmed murthal gangrapes to police hc informed

Haryana, Murthal, Murthal gangrape, Haryana government, Jat agitation, Haryana mass rapes, Jat quota agitation, Prakash Singh, murthal dhabas

While the state government has refused to divulge contents of the report, selected information being quoted from the report has left the state government fuming.

మహిళలు ఇక్కడకు నగ్నంగా పరిగెత్తుకోచ్చారు..

Posted: 05/31/2016 10:24 AM IST
Eyewitnesses confirmed murthal gangrapes to police hc informed

మహిళలు ఇక్కడ నగ్నంగా దలదాచుకున్నారు. కార్లలోనూ, జీపుల్లోనూ, బైక్ లపై వెళ్లే మహిళలను బలవంతంగా ఈడ్చుకోచ్చి వారి వస్త్రాలను చించి నగ్నంగా చేయడంతో వారిలో కొందరు ఇక్కడకు నగ్నంగానే పరుగెత్తుకోచ్చి తలదాచుకున్నారు. ఈ విషయాన్ని ముర్తాల్ ధాబా యజమాని స్వయంగా ఇచ్చిన వాంగ్మూలం ఇచ్చాడు. ముర్తాల్ సామూహిక అత్యాచారాలపై దర్యాప్తు చేస్తున్న ప్రకాష్ కమిటీ ఎదుట ధాబా యజమాని ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చాడు.

ఈ మేరకు ఈ కేసును విచారిస్తున్న న్యాయస్థానం తెలపడంతో.. ఇన్నాళ్లు జాట్ లను, వారి ఉద్యమాన్ని వెనకేసుకువస్తున్న ప్రభుత్వం నోట్లో పచ్చి వెలకాయ పడినట్లయ్యింది. జాట్ ల ఉద్యమంలో ఎలాంటి అత్యాచారాలు జరగలేదని ఇన్నాళ్లు వాదిస్తున్న ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు. సామూహిక అత్యాచారాలు జరిగాయన్నఅరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రకాష్ కమిటి ఈ ఘటనలకు సంబంధించి తన నివేదికలో కీలకాంశాలు పోందుపర్చినట్టు సమాచారం. అయితే ప్రభుత్వం వేసిన కమిటీ.. ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలలోని అంశాలను వెల్లడించేందుకు ప్రభుత్వం ఇష్టపడటం లేదు.

ఈ నివేదికను పంజాబ్-హర్యానా హైకోర్టుకు సమర్పించడంతో.. గ్యాంగ్ రేప్ లు జరగలేదన్న ప్రభుత్వ వాదనకు విరుద్ధంగా ఇందులో అంశాలున్నట్టు వెల్లడైంది. 'ఫిబ్రవరి 22న జాట్ల ఆందోళన నేపథ్యంలో జరుగుతున్న అకృత్యాల తట్టుకోలేక ముర్తాల్ లో పలువురు మహిళలు నగ్నంగా రోడ్డుపక్కన తన దాబా హోటల్ లో తలదాచుకున్నారు. దాబా యాజమాని ఈ మేరకు స్టేట్ మెంట్ ఇవ్వడంతో దానిని ముగ్గురు సభ్యుల ప్రకాశ్ కమిటీ రికార్డ్ చేసింది. దీనిని కూడా నివేదికలో పోందుపర్చి ప్రభుత్వానికి సమర్పించింది.

తన హోటల్ లో తలదాచుకున్న మహిళలకు దుప్పట్లు, బట్టలు ఇచ్చానని దాబా యజమాని చెప్పాడు. తర్వాత వారిని సురక్షితంగా ఇంటికి పంపించాడని రిపోర్ట్ లో పేర్కొంద'ని అమికస్ క్యూరీ అనుమప్ గుప్తా వెల్లడించారు. అయితే అత్యాచారాలు జరగలేదని దాబా యజమాని తమ ఇంటరాగేషన్ లో చెప్పాడని కోర్టుకు 'సిట్' చీఫ్‌ మమతా సింగ్ తెలిపారు. కోర్టులో విచారణ సందర్భంగా గుప్తా, హర్యానా ప్రభుత్వ తరపు న్యాయవాది లోకేశ్ సిన్హాల్ మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles