కలెక్టర్ పై ఎమ్మెల్యే ‘సెక్సీ’ కామెంట్లు | FIR against MLA for calling collector heroine

Fir against mla for calling collector heroine

Chhattisgarh, Congress MLA Amarjeet Bhagat, Surguja collector Ritu Sain, heroine, కలెక్టర్ రీతూ సేన్, హీరోయిన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అమర్ జీత్ భగత్, ఛత్తీస్ గఢ్, latest news, politics

Chhattisgarh Congress MLA Amarjeet Bhagat for describing Surguja collector Ritu Sain as someone "who looks like a heroine, but is never seen working" and calling education minister Kedar Kashyap "baruha" (mad).

కలెక్టర్ పై ఎమ్మెల్యే ‘సెక్సీ’ కామెంట్లు

Posted: 05/31/2016 11:13 AM IST
Fir against mla for calling collector heroine

ఈ మధ్య నేతలకు ఇదోక ఫ్యాషన్ అయిపోయింది. లేపిపోని వ్యాఖ్యలు చేస్తూ సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. అయినా ఆగుతున్నారా? వారిని చూసి ఇంకోరు, ఆపై ఇంకోకరు. తాజాగా మరో నేత తన నాలుకకు పని చెప్పాడు. ప్రజా సభలోనే ఓ మహిళా కలెక్టర్ పై సెక్సీ కామెంట్లు చేశాడు. అంతటితో ఆగాడా తన ప్రత్యర్థి పై తిట్ల దండకం ఉపయోగించాడు. అంతే ఆయనగారి కామెంట్లు నెట్ లోకి చేరటం, ఆపై అవతలి పార్టీలు తమ నోటితో బదులివ్వటం చకచకా జరిగిపోతున్నాయి.

ఛత్తీస్ గఢ్ లో బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన చేపట్టింది. సర్ గుజాలో నిర్వహించిన ర్యాలీలో సీతాపూర్ ఎమ్మెల్యే అమర్ జీత్ భగత్ పాల్గొన్నారు. తమ  సమస్యలపై ప్రస్తావిస్తాడనుకున్న ప్రజలకు పెద్ద షాకే తగిలింది. భిన్నంగా ఆ జిల్లా కలెక్టర్ రీతూ సేన్ పై సెక్సీ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు అందంగా, హీరోయిన్ లా ఉన్నారు. మీరు సినిమాల్లో నటించడం నేనెప్పుడూ చూడలేదంటూ’’  వ్యాఖ్యానించాడు. అంతేనా తన 48 ఏళ్ల జీవితంలో విద్యాశాఖ మంత్రి కేదార్ కశ్యప్ లాంటి పిచ్చివాడిని చూడలేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటనపై ఆగ్రహాం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడంతోపాటు, అసభ్యపదజాలం వాడినందుకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు లక్షల ప్రజాప్రతినిధులకు నాయకత్వం వహిస్తున్న ఓ లీడర్ ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles