మోత్కుపల్లి డిమాండా? రిక్వెస్టా? | Motkupalli Narasimhulu request chandrababu for RS

Motkupalli narasimhulu request chandrababu for rs

Telangana TDP, Motkupalli Narasimhulu, Rajyasabha seat, chandrababu, తెలంగాణ సీనియర్ నేత, మోత్కుపల్లి నర్సింహులు, రాజ్యసభ స్థానం, తిరుపతి మహానాడు, ap news, ap politics, political news, latest news

senior Dalit leader from Telangana Motkupalli Narasimhulu request chandrababu for rajyasabha seat at tirupathi mahanadu.

మోత్కుపల్లి డిమాండా? రిక్వెస్టా?

Posted: 05/28/2016 01:35 PM IST
Motkupalli narasimhulu request chandrababu for rs

టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలను మౌనంగా చూస్తు ఉండటం తప్పించి ఏం చేయలేని స్థితిలో ఉన్నారు సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు. పార్టీలో ఒకప్పుడు కీలక నేతగా ఉన్న ఆయన ఎన్నికల్లో ఓటమి తర్వాత స్తబ్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో గవర్నర్ పదవిపై ఆశలు పెంచుకొని భంగపడి,  చివరకు రాజ్యసభ సీటైనా వస్తుందని ఎదురు చూస్తున్నారు. అధినాయకత్వం తెలంగాణ పార్టీ శాఖను ఆరో వేలుగా భావిస్తోందని తొటి నేతల దగ్గరే ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ నేతలు టీఆర్ఎస్ లో చేరటం చూసి కంటతడిపెట్టుకున్న ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడుతున్న తనకేం ఒరగడం లేదంటూ బహిరంగంగానే కామెంట్లు చేశారు కూడా. అసలు ఈ నిరాశావాదం వెనుక రాజ్యసభ సీటు దక్కకపోవటం అసలు కారణమని అని తర్వాత తెలిసిందిలేండి.  

ఇక ఈసారి వచ్చిన ఛాన్స్ ను అస్సలు మిస్సవ్వకూడదని నిర్ణయించుకున్నారు. 6 రాజ్యసభ స్థానాలలో తెలంగాణ తమ్ముళ్లకు ఒక్క సీటు కూడా ఇవ్వొద్దని అధిష్ఠానం అనుకుంటుండగా, చివరి వరకు ప్రయత్నించి ఎలాగైనా సాధించాలని మోత్కుపల్లి డిసైడ్ అయ్యారు. తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని పరోక్షంగా ఆయన చంద్రబాబునాయుడినే వేడుకుంటున్నారు. తిరుపతి మహానాడులో వేదికపై ఈ  ఐదేళ్లలో తాను పార్టీ కోసం పడిన కష్టాన్ని అధినేతకి వివరించే ప్రయత్నం చేశారు. పార్టీలో కేసీఆర్ ను విమర్శించేందుకు ఎవరూ ముందుకు రాని సమయంలో తాను ముందుకు వచ్చి యుద్ధం ప్రకటించానని గుర్తుచేశారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్నానని, ఇప్పటికైనా తన కష్టం గుర్తించాలని విజ్నప్తి చేశారు. ఇదే టైంలో తనకు ఆంధ్రా నుంచి సీటు ఇచ్చినా ఫర్వాలేదంటూ హింట్ కూడా ఇచ్చారాయన. ‘‘నాకు ఏ ప్రాంతంతలో సంబంధం లేదు. తెలంగాణ అనుకుంటే తెలంగాణ వాడిని, ఆంధ్రా అనుకుంటే ఆంధ్రావాడిని’’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈసారి కూడా మొండిచేయి చూపిస్తే మాత్రం ఆయన ఖచ్చితంగా కఠిన నిర్ణయమే తీసుకోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana TDP  Motkupalli Narasimhulu  Tirupathi mahanadu  Rajyasabha seat  chandrababu  

Other Articles