రమ్యకృష్ణను భర్తే చంపాడా? | NRI woman Ramya Krishna death a suicide or murder

Nri woman ramya krishna death a suicide or murder

NRI Ramya Krishna Pendurthy, Mahanth, Australia, death, kukatpally, ఎన్నారై రమ్యకృష్ణ, మహంత్, కూకట్ పల్లి, ఆస్ట్రేలియా, హత్య, latest telugu news, telugu news, hyderabad news

Hyderabad woman died in Australia under suspicious circumstances. Body of woman Ramya Krishna Pendurthy, that arrived in Hyderabad today, was reportedly abandoned by her husband. Even though Ramya Krishna's parents alleged that her husband Mahanth killed her for additional dowry, Mahanth said that his wife Ramya Krishna committed suicide by hanging herself.

ITEMVIDEOS: రమ్యకృష్ణను భర్తే చంపాడా?

Posted: 05/28/2016 03:24 PM IST
Nri woman ramya krishna death a suicide or murder

ఆనందోత్సాహాలతో భర్తతో కలిసి కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ యువతి జీవితం అర్థాంతరంగా ముగిసింది. హైదరాబాద్ కు చెందిన పెందుర్తి రమ్యకృష్ణ  ఆత్మహత్యాయత్నం చేసుకుని, రెండు రోజులు కోమాలో ఉండి తుదిశ్వాస విడిచింది. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఆమె శవాన్ని హైదరాబాద్ కి తీసుకొచ్చిన భర్త మహంత్ ఎయిర్ పోర్ట్ లోనే వదిలేసి తర్వాతి ఫ్లైట్ లోనే తిరిగి వెళ్లిపోయాడు. దీంతో అసలు ఇది ఆత్మహత్యా లేక హత్యా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

అసలేం జరిగింది...
హైదరాబాదులోని కూకట్ పల్లికి చెందిన రమ్యకృష్ణకు మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ మహంత్ తో పెళ్లైంది. ఆ సమయంలో కట్నంగా కోటిన్నర విలువ చేసే ఓ బిల్డింగ్ తోపాటు, వ్యాపారం కోసం 50 లక్షల నగదును మహంత్ కు ఇచ్చారు. ఆపై కొత్త జీవితం కోసం రమ్య భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లింది. ఈ లోగా ఏమైందో ఏమో తెలియదు కానీ... రెండు రోజుల క్రితం ఆమె ఆస్ట్రేలియాలోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఇండియాకు వెళ్లమంటే తనకు ఇష్టం లేదంటూ గొడవపడి తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందంటూ మహంత్ చెబుతున్నాడంట. ఇక ఆస్ట్రేలియా వైద్యులు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆమె గొంతునొక్కి ఉన్నట్లు, ఆపై రెండు రోజులు కోమాలో ఉండి చనిపోయినట్లు తెలుస్తోంది.

అనుమానాలు...
డబ్బు కోసమే మహంత్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని రమ్య తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. రమ్య పాస్ పోర్ట్ తో అటు నుంచే అటే ఉడాయించడం, రమ్య మరణంపై సరైన వివరణ లేకపోవడంతో తమ కుమార్తెది ముమ్మాటికి హత్యేనని చెబుతున్నారు. అంతేకాదు ఆమె పేరిట ఉన్న రెండున్నర కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ కోసమే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని ఆమె సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఎలాంటి సూసైడ్ నోట్ దొరక్కపోవటం, కాళ్లు మంచానికి ఆనుకోని ఉండటం దీనిని మరింత బలపరుస్తుందని అతను అంటున్నాడు. అయితే మహంత్ ను అదుపులోకి తీసుకుంటేనే మిగతా విషయాలు బయటికి వస్తాయని, ఇందుకోసం ఆస్ట్రేలియా అధికారుల సహకారం కోరతామని స్థానిక పోలీసులు చెబుతున్నారు. తమ మధ్యే పెరిగిన ఓ అమ్మాయి  ఇలా విగతజీవిలా పడి ఉండటం చూసిన పలువురు స్థానికులు కన్నీటిపర్యంతమౌతున్నారు. అన్యాయంగా రమ్యను పొట్టనబెట్టుకున్న మహంత్ ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NRI Ramya Krishna Pendurthy  Mahanth  Australia  death  kukatpally  

Other Articles