రేసుగుర్రం పాటకు చిందులేసిన లేడీ ఐఏఎస్ | khammam joint collector dance for racegurram song

Khammam joint collector dance for racegurram song

khammam joint collector, joint collector divya dance, IAS divya dance, రేసుగుర్రం పాటకి ఐఏఎస్ డాన్స్, ఖమ్మం వార్తలు, తెలంగాణ న్యూస్, telangana news, political news, latest news

khammam joint collector divya and sub collector dance for racegurram song at telangana two years celebrations.

ITEMVIDEOS: రేసుగుర్రం పాటకు చిందులేసిన లేడీ ఐఏఎస్

Posted: 05/28/2016 12:31 PM IST
Khammam joint collector dance for racegurram song

సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఎంత క్రమశిక్షణతో ఉంటారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఉన్నతస్థాయి పొజిషన్ లో మెలగాల్సిన వారికోసం ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. కానీ, మొన్నామధ్య ఓ యువ ఐఏఎస్ చేసిన నిర్వాకం మాత్రం పెద్ద రచ్చకే దారితీసింది. జగదీశ్ సోంకర్ అనే ఓ ఐఏఎస్ రాయ్ పూర్ ఒక ఆసుపత్రిని సందర్శించాడు. అక్కడ అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని చూసి, ఆమె తల్లితో మాట్లాడేప్పుడు కాలు స్టైల్ గా మంచం మీద పెట్టి నిలుచున్నాడు. ఓ వ్యక్తి అది ఫోటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా, విమర్శలు రావటంతో ఏకంగా అతన్ని సస్పెండ్ చేసింది ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం. ఇది మరిచిపోకముందే మరో యువ ఐఏఎస్ నిర్వాకం బయటపడింది.

ఖమ్మం జిల్లాలో తెలంగాణ రెండేళ్ల సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు జాయింట్ కలెక్టర్ దివ్య, డిప్యూటి కలెక్టర్ హాజరయ్యారు. స్టేజిపై ఉన్న యాంకర్ సడన్ గా దివ్యను స్టేజీ మీదకు లాగింది. ఆపై రేసుగుర్రంలోని సినిమా చూపిస్త మావా పాట ప్లే కావటంతో పునకం వచ్చినట్లు వారంతా స్టెపులేయటం ప్రారంభించారు. అక్కడే ఉన్న డిప్యూటీ కలెక్టర్ సాబ్ కూడా ఈవిడగారితో స్టెప్పులు కలిపాడు. అంతా కలిసి మైమరిచి చిందులేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్ లో హల్‌చల్‌ చేస్తుండగా, ఎన్ని విమర్శలు వస్తాయోనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.   

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles