'Will make BJP an alternative to TRS' says new chief lakshman

Lakshman replaced kishan reddy as telangana bjp chief

k laxman, BJP, telangana new chief, Ghatkesar, Osmania University, kishan reddy, bjp floor leader, amit shah, telangana bjp unit, hyderabad news, india news, social news, latest news

The BJP floor leader in Assembly K.Lakshman, who has been appointed president of the party’s Telangana unit, is a second-time MLA from Musheerabad constituency in Hyderabad

గ్రామగ్రామన పార్టీ పతాకం అవిష్కరించేలా చూస్తా: లక్ష్మణ్

Posted: 04/09/2016 10:19 AM IST
Lakshman replaced kishan reddy as telangana bjp chief

బిజేపీ పార్టీని సంస్థాగతంగా గ్రామగ్రామానా బలోపేతం చేయడమే తన ముందు వున్న ప్రధాన లక్ష్యమని.. తెలంగాణ బీజేపి పగ్గాలను నూతనంగా అందుకున్న డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసి పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని గ్రామాల్లో పార్టీ జెండా ఎగరవేసేలాగా చర్యలు తీసుకోవడమే తన ముందున్న లక్ష్యమన్నారు. అలాగే కేం ద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. వాటిని కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని అన్నారు.

భారతీయ జనతా పార్టీ అంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. మిగతా పార్టీల మాదిరిగా వారసత్వాలకు చోటు ఉండదన్నారు. ఇక్కడ ఎవరు ఏ స్థాయిలో పని చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందే తప్ప ఏ ఒక్కరికి సంబంధించిన అవమే కాదన్నారు. తాను కూడా కార్యకర్తతో మొదలుకుని ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడితో పాటు వివిధ విభాగాల్లో పనిచేశాని ఆ విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు పార్టీ అధిష్టానం అధ్యక్ష బాధ్యతలను అప్పగించిందని, వాటిని కూడా నిబద్దతగా నిర్వహిస్తానన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుని ఆదేశాలను శిరసావహిస్తాను.

పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తనపై నమ్మకం ఉంచి గురుతర బాధ్యతలు అప్పగించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయం చేస్తానన్నారు. కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా, సీనియర్ నాయకుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని పని చేస్తానని చెప్పారు. మొత్తంగా తెలంగాణలో 2019 నాటికి బలీయమైన శక్తిగా, ప్రత్యామ్నాయంగా బీజేపీని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానని చెప్పారు. బీజేపీకి సిద్ధాంతపరమైన బలమైన నిర్మాణం ఉందని, ఎవరైనా అందుకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. పార్టీలో సీనియర్ల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, జూనియర్లను కలుపుకుని ముందుకెళ్తాను. అందరినీ కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : K. Laxman  BJP  telangana new chief  Ghatkesar  Osmania University  kishan reddy  

Other Articles