Interest rates on PPF, NSC, other small savings schemes to be lower from today

Additional tax benefit for first time home buyers from today

Small savings schemes, PPF, Public Provident Fund, Interest rate on PPF, interest rates, Kisan Vikas Patra, Sukanya Samriddhi Account, PPF, Kisan Vikas document, interest deduction, Arun Jaitley, budget, first-time home buyers

Interest rate on small savings schemes, including PPF, Kisan Vikas Patra (KVP) and senior citizen deposits, will be cut by up to 1.3 percent from Friday as the government moves towards quarterly alignment of rates with the market.

చిన్న మొత్తాలపై వడ్డీ కోత

Posted: 04/01/2016 12:38 PM IST
Additional tax benefit for first time home buyers from today

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇవాళ్టి నుంచి అమలులోకి వస్తుండగా.. దీంతో మధ్యతరగతి ప్రజలు తొలిసారిగా నిర్మించుకునే ఇళ్లపై పన్ను రాయితీ పెరగనుంది. అటు ఇవాళ్టి నుంచి త్రైమాసికం వరకు పేదలు, రైతులు, కూలీలు, మహిళలు, వృద్దులు చిన్న స్థాయిలో చేసే పోదుపు పథకాలపై వడ్డీపై మాత్రం కొత పడనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఏడాది బడ్జెట్ లో ప్రవేశపెట్టిన రాయితీ ప్రయోజనాలు వీరికి కలసి రానున్నాయి. తొలిసారి ఇంటిని కొనుగోలు చేస్తున్న వారికి ఇవాళ్టి నుంచి అదనపు పన్ను ప్రయోజనాలను పొందుతారు.

అయితే కొనుగోలు చేస్తున్న ఇంటి విలువ రూ.50 లక్షల లోపు, దానిపై తీసుకున్న రుణం రూ.35 లక్షల లోపు ఉండాలి. ఈ మేరకు తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి ఇంటి కొనుగోలు చేసేవారు రుణ వడ్డీపై రూ.50,000 వరకు అదనపు పన్ను ప్రయోజనాన్ని పొందే వెసులుబాటు కల్పించారు. ఈ ప్రతిపాదన ఇవాళ్టి నుంచి అమలులోకి రానున్నది. దీంతో తొలిసారి ఇంటిని కొనుగోలు చేసేవారు మొత్తంగా ఇంటి రుణ వడ్డీపై ఏడాదికి రూ.2.5 లక్షలు మినహాయింపు పొందొచ్చు.

అదే సమయంలో అటు పేద, మద్య తరగతి ప్రజలు అధికంగా చేసే పోదుపు పథకాలపై మాత్రం వడ్డీలో కోతలు పడతున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస పత్ర (కేవీపీ), సీనియర్ సిటిజన్ డిపాజిట్లు, బాలికా పొదుపు పథకం- సుకన్యా సమృద్ధి యోజనసహా పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై శుక్రవారం నుంచీ వడ్డీరేట్లు తగ్గుతున్నాయి. మూడు నెలలకోసారి మార్కెట్ రేటుకు అనుగుణంగా చిన్న పొదుపు రేట్లను సవరించాలన్న కేంద్ర నిర్ణయం నేపథ్యంలో ఆయా పొదుపు పథకాలపై 1.3 శాతం వరకూ వడ్డీరేటు తగ్గనుంది. ప్రతి త్రైమాసికానికీ... ముందు నెల 15వ తేదీ చిన్న పొదుపులపై రేట్లను సమీక్షిస్తారు.

దీని ప్రకారం జులై నుంచి సెప్టెంబర్ మధ్య అమలయ్యే వడ్డీరేటు జూన్ 15న నిర్ణయమవుతుంది. ఈ వడ్డీ రేట్లకు ప్రాతిపదికగా అంతకు ముదు మూడు నెలల ప్రభుత్వ బాండ్ల రేటును తీసుకుంటారు. ఆర్థికాభివృద్ధికి దోహద పడేలా వ్యవస్థను తక్కువ స్థాయి వడ్డీరేటులోకి మార్చాలన్న కేంద్రం లక్ష్యంలో భాగంగా తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తీవ్ర వ్యాధులు, పిల్లల విద్య వంటి తప్పని అవసరాలకైతే పీపీఎఫ్ అకౌంట్ల ముందస్తు ఉపసంహరణలకూ కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే అకౌంట్ ప్రారంభమై ఐదేళ్లు పూర్తి కావాల్సి ఉంటుంది. మొత్తం డిపాజిట్‌పై చెల్లించే వడ్డీలో ఒకశాతం జరిమానాగా ఉంటుంది.

* కిసాన్ వికాస్ పత్రాలపై వడ్డీ రేటు తగ్గటంతో 100 నెలలకు రెట్టింపు అవుతున్న పొదుపు ఇకపై 110 నెలలకు రెట్టింపవుతుంది.

* తపాలా సేవింగ్స్‌పై రేటు 4 శాతంగా కొనసాగుతుంది.

* ఐదేళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్‌పై వడ్డీ 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గింది.

* ఐదేళ్ల మంత్లీ ఇన్‌కమ్ డిపాజిట్లపై కూడా వడ్డీ 8.4 శాతం నుంచి 7.8 శాతానికి దిగింది.

* పోస్టాఫీస్ ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై లభించిన 8.4 శాతం వడ్డీ ఇకపై ఏడాదికి 7.1 శాతం, రెండేళ్లకు 7.2 శాతం, మూడేళ్లకు 7.4 శాతం వడ్డీ అందుతుంది.

* పోస్టాఫీస్ ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై రేటు 8.5 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గింది.

* పోస్టాఫీస్ ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై రేటు 8.4 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది.

* సుకన్యా సంమృద్ధి యోజనపై వడ్డీని కూడా 9.2 నుంచి 8.6 శాతానికి తగ్గించారు.

* ఐదేళ్ల సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ కూడా 9.3 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PPF  Kisan Vikas document  interest deduction  Arun Jaitley  budget  first-time home buyers  

Other Articles