radha prasanthi says its not just a pen drive, its my life

Radha prasanthi thanks banjara hills police to handovering her life

pen dive, radha prasanthi, tollywood actress, banjara hill police, somajiguda press club, jagadish, lb nagar, special team, crime party police,

its not just pen drive, its my life, thanks to banjara hills police as they hand overed my life says actor radha prasanthi

నాకు జీవితాన్ని అందించిన పోలీసులకు ధన్యవాదాలు: ప్రముఖ నటి

Posted: 04/01/2016 12:29 PM IST
Radha prasanthi thanks banjara hills police to handovering her life

తనకు చెందిన ఓ చిన్న పెన్‌డ్రైవ్ పోయిందన్న పిర్యాదుపై గత వారం బంజారాహిల్స్ ఫోలీసులపై అనేక కథనాలు వచ్చాయని, అయితే అది చిన్న పెన్ డ్రైవ్ కాదని, తన జీవితమని సినీ నటి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత రాధా ప్రశాంతి తెలిపారు. ఈ ఉదంతాలపై లేటుగా స్పందించిన అమె పెన్‌డ్రైవ్ వెల గురించి తాను పోలీసులకు పిర్యాదు చేయలేదని, అయితే అందులో నిక్షిప్తమై వున్న డాటాలో తన జీవితం ఉందని  తెలిపారు. తన జీవితాన్ని తనకు అందించిన బంజారాహిల్స్ పోలీసులకు అమె ధన్యవాదాలు తెలిపారు.

ఇక ఆ పెన్‌డ్రైవ్‌లో ఏమున్నాయంటే.. తన ఫొటోలు, తన కుటుంబసభ్యుల ఫొటోలు. ఆ మద్య తరుచుగా మనం అనేక మంది నటీనటులు మార్పింగ్ ఫోటోలు నెట్ లో ప్రత్యక్షమవ్వడం చూస్తున్నాం. అలాంటిదే జరిగితే తన జీవితమే వ్యర్థమవుతుందని అమే అంధోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై తాను పోలీసులకు పిర్యాదు చేయడంతో, వారు ఒక నటిగా కాకుండా ఓ ఆడపడుచుగా తన ఆవేదనను అర్థం చేసుకుని క్రైంపార్టీ పోలీసులతో తన పెన్‌డ్రైవ్ ను వెతికించి తనకు అప్పగించారని అమె తెలిపారు.

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన అమె.. మూడు వారాలక్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి తాను రాష్ట్రపతి అవార్డుగ్రహీతను కావడం, పలు సామాజిక కార్యక్ర మాల్లో ముందుండటం, 100కు పైగా సినిమాల్లో నటించడంతో తనకు ఒక ప్రత్యేక పేజీ రూపొందిస్తానని మాయమాటలు చెప్పి తన పెన్‌డ్రైవ్ తీసుకెళ్లాడని తెలిపారు. ఆ పెన్‌డ్రైవ్‌లో తన కుటుంబ సభ్యుల ఫొటోలతో పాటు తాను సినిమాల్లో నటించినప్పటి ఫొటోలు, విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. అందుకే బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. దీనిపై పలు వార్తా పత్రికలు రకరకాలుగా రాయడం తనను తీవ్రంగా బాధిస్తోందన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles